గాంధీ హత్యతో సంఘ్ కి ముడిపెడుతూ సీపీఎం ఎంపీ నిరాధార ఆరోపణలు.. క్షమాపణలు చెప్పాలని సంఘ్ డిమాండ్

మహాత్మా గాంధీ హత్యతో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ కి సంబంధం వుందంటూ సీపీఎం ఎంపీ సచ్చితానందం చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  తీవ్రంగా మండిపడింది. సీపీఎం ఎంపీ సచ్చిదానందం తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. వెంటనే ఇలా చేయని పక్షంలో చట్టపరమైన చర్యలకు దిగుతామని దక్షిణ భారత్‌ ప్రచార ప్రముఖ్‌ శ్రీరామ్‌ రెండు పేజీల ప్రకటనను విడుదల చేశారు. కమ్యూనిస్టు ఎంపీ చేసిన వ్యాఖ్యలను అందులో ఖండించారు . గత 99 సంవత్సరాలుగా దేశభక్తి, హిందూ సమాజ సంఘటనం, ఆధ్యాత్మిక విలువలతో నిబద్ధత గల సంస్థగా నడుస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరెస్సెస్‌ అతిపెద్ద సంస్థ అని, అలాగే సేవా అనే అంశం ఆధారంగా దేశ వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలలో నిమగ్నమై వుందన్నారు.
అయితే.. ఈ సేవలు కేవలం సాధారణ సమయాల్లోనే కాదని, ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, ప్రమాదాలు అలాగే మహమ్మారి విజృంభించిన కాలంలోనూ సేవలందించామని గుర్తు చేశారు. కులం, మతం, ఇతరత్రా ఇతరత్రా అన్న అంశాలపై సంబంధమే లేకుండా స్వయంసేవకులు నిస్వార్థంగా సేవలు చేస్తున్నారన్నారు. యువతలో ఆరెస్సెస్‌లో చేరితే దేశభక్తి భావాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో సివిల్‌ సర్వెంట్లు ఆరెస్సెస్‌లో చేరడాన్ని బ్రిటీష్‌ సర్కార్‌ నిషేధించిందని, తద్వారా సివిల్‌ సర్వీసెస్‌లో చేరాలనుకునే వారెవ్వరూ ఆరెస్సెస్‌ వైపు చూడకుండా కుట్రపన్నిందని వెల్లడిరచారు.
సంఘ్ ను గాంధీ హత్యతో అనుసంధానం చేస్తూ సీపీఎం ఎంపీ నిరాధారమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఈ ఆరోపణలను తాము ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. 1966 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సంఘ్ లో చేరకుండా నిషేధిత ఉత్తర్వులను తీసుకొచ్చారని, ఇలాంటి అప్రజాస్వామిక ఉత్తర్వులను కొద్ది రోజుల క్రిందటే భారత ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇది విజయ సంకేతంగా అభివర్ణించారు. రాజకీయాలు, ఆధ్యాత్మికత, ట్రేడ్‌ యూనియన్‌, సేవ, వ్యవసాయంతో పాటు వివిధ రంగాలలో స్వయం సేవకులు విశేషమైన కృషి చేశారని తెలిపారు. ఈ విజయాలను, సేవలను విస్మరించి, కమ్యూనిస్టు పార్టీ ఎంపీలు తప్పుడు మాటలు మాట్లాడారని, ఇటీవలే కేంద్రం విడుదల చేసిన ఉత్తర్వులను కూడా వ్యతిరేకించారన్నారు.
1948 లో గాంధీ హత్యకు గురైనపుడు ఆరెస్సెస్‌ను మొదట నిషేధించారని, అయితే.. ఈ హత్యలో సంఘ్ కి ప్రమేయం లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చి, నిషేధాన్ని ఎత్తేసిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి వివిధ విచారణ కమిషన్లు కూడా ఈ తీర్పును ధృవీకరించాయన్నారు. 1934 లో గాంధీజీ మహారాష్ట్రలోని వార్ధా శిబిరాన్ని కూడా సందర్శించారని, సంఘ్ చేస్తున్న పనులను గుర్తించారన్నారు. అయినా సరే.. సంఘ్ ప్రత్యర్థులు ప్రతి సారీ గాంధీ హత్యను సంఘ్ కి ముడిపెట్టి… తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూనే వున్నారని ఆక్షేపించారు. అలాగే 1962 చైనా భారత్‌ యుద్ధం ముగిసిన తర్వాత కూడా రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొనాలని అప్పటి ప్రధాని నెహ్రూ సంఫ్‌ుని ఆహ్వానించారని గుర్తు చేశారు. కమ్యూనిస్టులు, ఇతర వామపక్ష పార్టీలు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పతనమయ్యాయని, అలాగే డీఎంకే లాంటి గుప్పెడు ప్రాంతీయ పార్టీలతో ఇండియా కూటమి మనుగడ సాగిస్తున్నాయని శ్రీరాం అన్నారు. ఈ కారణంగానే తమ ఉనికిని చాటుకునేందుకు వామపక్ష సభ్యులు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని శ్రీరాం మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *