అకాల వర్షాలకి తెలంగాణలో 3,120 ఎకరాల్లో పంట నష్టం…
తెలంగాణలో అకాల వర్షాలు, వడగళ్లు రైతులకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి. కోతకు వచ్చిన వరి పంటతో పాటు మామిడి పంటకి తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే… తాజాగా కురిసిన అకాల వర్షాల కారణంగా తెలంగాణలో 3,120 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చేసింది.. ఈ మేరకు ప్రభుత్వానికి కూడా ఓ నివేదికను సమర్పించింది. నారాయణ పేట, నాగర్ కర్నూలు, కామారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి, సిద్ధిపేట జిల్లాలతో పాటు రంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో కూడా పంటలు దెబ్బతిన్నాయని, ఇలా మొత్తం 3,120 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు తమ నివేదికల్లో పేర్కొన్నారు.
అలాగే వరి, మొక్కజొన్నతో పాటు ఉద్యానవన పంటలు కూడా దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ గుర్తించింది.మరోవైపు మెదక్, పెద్దపల్లి, వనపర్తి,జగిత్యాల, వికారాబాద్, భూపాలపల్లి, వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా పంటలు దెబ్బతిన్నాయి. అయితే…ఇది ప్రాథమికంగా మాత్రమే. ఇంకా అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అత్యధికంగా మాత్రం కామారెడ్డి జిల్లాలో 10,328 ఎకరాల్లో నష్టం జరిగింది. ఎకరాకి 10 వేల రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని నిర్ణయించారు.
మరోవైపు పంట నష్టంపై రైతుల వారీగా వివరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రైతు పేరు, పంట పేరు, సర్వే నంబరు, జరిగిన పంట నష్టం, పట్టాదారు పాసస పుస్తకం ఖాతా నెంబరు, బ్యాంకు అంకౌంట్ నెంబరు, తదితర వివరాలను పక్కాగా సేకరించాలని ఆదేశించారు. వడగళ్లు, గాలి దుమారాలు, అకాల వర్షాaతో నష్టపోయిన పంటల వివరాలపై మరో మూడు రోజుల్లో సర్వే పూర్తి కానుంది.
నివేదికలు అందగానే నష్టపరిహారం చెల్లింపు : మంత్రి తుమ్మల
వర్షాలతో జరిగిన పంట నష్టంపై అధికారులు సర్వే చేస్తున్నారని , నివేదికలు అందగానే నష్టపరిహారం ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. రైతుల వారీగా సర్వే చేసి , తక్షణమే నివేదిక ఇవ్వాలని తాము ఆదేశించామన్నారు. ఇక… రైతులకు నషషట పరిహారం పంపిణీ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతి కోరినట్లు వెల్లడిరచారు. అయితే.. అనుమతి రాలేదని, మరోమారు రైతుల కోసం అడుగుతామని ప్రకటించారు.