ఆరోగ్యం కోసం ఆముదం వాడే విధానాలివి
రెండు లేక మూడు నెలలకు ఒకసారి మాత్రమే ఇలా చేయవలెను.
పొద్దున్నే 5 గంటలకు , రెండు లేక మూడు స్పూన్ల గోరువెచ్చని ఆముదము త్రాగితే అది విరేచన కారి ( ప్రేగులను శుద్ది చేయుటకు తద్వారా వాత ప్రకోపమును తగ్గించుటకు ఉపయోగము).
2. ఒక స్పూను ఆముదము , మూడు స్పూన్ల ఆవు నెయ్యి కలిపి దానిని పప్పు తాలింపు కు వాడుకోవాలి. ఇది నలుగురికి సరిపడా. దానినే వేడి అన్నంలో వేసుకొని కూడా తినవచ్చు. అలా చేస్తే మరునాడు పొద్దున్నే సుఖ విరేచనం అవుతుంది. వారములో మూడు రోజులు ఇలా చేయవచ్చు.
3. ఆడవారు పీరియడ్ అయిన మొదటి మూడు రోజులూ , రాత్రి పడుకొనే ముందు , బొడ్డులో రెండు చుక్కలు ఆముదము రాసుకోవాలి. మెల్లిగా 40 సార్లు చూపుడు వేలితో మసాజ్ చేసుకోవాలి. అలా చేస్తే
ఆ నాలుగు రోజులూ వారిలో వుండే వాత ప్రకోపము తగ్గును.
4a. కొబ్బరి నూనె 500ml , ఆముదము 100ml రెండింటినీ కలిపి ఉంచుకోవాలి.
దానిని హెయిర్ ఆయిల్ లాగా జుట్టుకి రాసుకోవాలి. జుట్టు ఎక్కువ కాలము నల్లగా వుంటుంది. జుట్టు రాలుట తగ్గుతుంది.
4b. అదే ఆయిల్ ను రోజూ పడుకొనే ముందు అరికాళ్లు , కాళ్ళు , చేతులకు రాసుకోవాలి. వాత సమస్యలకు ఉపశమనము కలుగుతుంది.
5. cataract ( dryness of eye,) సమస్య నివారణకు
5a. కను పాప మీద వుండే హెయిర్ కి రాత్రి పూట పడుకొనే ముందు ఆముదము, ఒక చుక్కను మాత్రమే, రాసుకోవాలి. ఒక ఆముదము చుక్కను రెండు వేళ్ళ మధ్య ( చూపుడు వేలు బొటన వేలు) తీసుకొని దానిని ఆ హెయిర్ కు రాసుకోవాలి. మొదట వరసగా మూడు రోజులు రాసి తదుపరి వారములో రెండు రోజులు అలా రాస్తే చాలును.
ఆముదము తో దీపము పెట్టుకొని ( బెడ్ లాంప్ లాగా ) రాత్రియందు ఆ వెలుగులో పడుకోవాలి.
ఆముదము దీపము వెలిగిస్తే వచ్చే మసిని ఒక్ ఇత్తడి plate మీద సేకరించి , దానికి తగుమాత్రం ఆవు నెయ్యి కలిపి కాటుక లాగా పెట్టుకోవాలి.