అతి తక్కువ ఖర్చు.. తక్కువ నీరుతో దోస పంట… లాభం మాత్రం పుష్కలం

వేసవి కాలంలో అతి తక్కువ ఖర్చు, అతి తక్కువ నీటితో అధిక పంటలు పండించాలని ప్రతి రైతు అనుకుంటున్నాడు. ఎందుకంటే అధిక ఎండలు, నీటి ఎద్దడితో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో ఏ పంటలు పండిరచాలో రైతులకు పూర్తిగా అర్థం కాదు. అయితే.. మండు ఎండల్లోనూ అతి తక్కువ ఖర్చు, అతి తక్కువ శ్రమతో ఓ పంటను సులభంగా పండిరచొచ్చు. ఆ పంటే దోస పంట. సాగు ఖర్చులు అతి తక్కువగా వుండే పంట దోస పంట. ఈ పంటకు రసాయన ఎరువుల వినియోగం కూడా వుండదు. అందుకే పెట్టుబడి వ్యయం తక్కువ. దోస పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే సేంద్రీయ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు డ్రిప్‌ విధానం ద్వారా నీటిని అందించాలి. అలాగే పొలంలో కలుపు సమస్య లేకుండా చూసుకోవాలి. దీంతో మంచి దిగుబడి సాధించవచ్చు. అతి తక్కువ నీటివనరులు వుండే ప్రాంతాల్లో కూడా ఈ పంటను సాగు చేయవచ్చు. మార్కెట్‌ లో కూడా ఈ పంటకు అధిక గిరాకీ వుంది. ఒక మాదిరి ఉష్ణోగ్రతలు వుండే వాతావరణ పరిస్థితులు దోస సాగుకు అనుకూలం. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు వుంటే దోసలో మగపూల శాతం పెరిగి, దిగుబడి క్షీణిస్తుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా దోస పంటకు కరీంనగర్‌, నిర్మల్‌ జిల్లాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. దోస పంటకు కేరాఫ్‌గా ఈ రెండు జిల్లాలు మారాయి. నిర్మల్‌ లోని కనకాపూర్‌ గ్రామం దోసకాయ పంటకు పేరు ప్రఖ్యాతులు గడిరచింది. గ్రామానికి చెందిన కొంత మంది రైతులు సమూహంగా మారి, దోస పంటను వేశారు. విపరీతంగా లాభాలు గడిస్తున్నారు. కేవలం 45 నుంచి 50 రోజుల్లోనే దోస పంట తమ చేతిలోకి వస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పంటల కంటే తక్కువ ఆదాయమే దోస పంటకు అవసరమవుతోందని, కేవలం 5 వేల నుంచి 10 వేల వరకు మాత్రమే ఖర్చు వస్తోందని రైతులు తెలిపారు. 5 నుంచి 10 వేల ఖర్చుపెడితే, తమకు లక్ష రూపాయల వరకు లాభం వస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే… ఈ జిల్లా రైతులందరూ రసాయన ఎరువులకు దూరంగా వుంటున్నారు. కేవలం సేంద్రియ ఎరువులను పంట సాగుకు వినియోగిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం కూడా అస్సలు లేకపోవడంతో ఖర్చులు కూడా లేవని రైతులు అంటున్నారు.

 

అయితే.. ఈ దోస పంటకు ప్రధానంగా రెడ్‌ పంప్‌కిన్‌ బీటిల్‌ తెగులు వస్తుంది. ఈ కీటకం నారింజ రంగులో వుంటుంది. వాటి పరిమాణం 7 మి.మీ. పొడవు మరియు 4.5 మి.మీ. వెడల్పు వుంటుంది. దీని తల లేత గోధుమ రంగులో వుంటుంది. ఈ పురుగు భూమి లోతులో వుంటుంది. మొక్కల వేర్లు మరియు కాండంలో రంధ్రాలు చేస్తుంది. ఈ తెగులు అక్టోబర్‌ వరుకు వుంటుంది. ఈ తెగులు కారణంగా మొక్క దిబ్బతింటుంది.

ఇలా కాకుండా వుండాలంటే… వేసవిలో పొలాన్ని లోతుగా దున్నాలి. తద్వారా ఈ పురుగు గుడ్లు మరియు బీటిల్స్‌ పైకి వచ్చి, అధిక వేడికి నాశనం అవుతాయి. దెబ్బతిన్న పండ్లను తెంచి, నాశనం చేయాలి. వ్యాధి సోకిన పంటల అవశేషాలను సేకరించి పొలంలో కాల్చాలి. ఇలా చేస్తూ పోతే.. దోస పంటను కాపాడుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *