”పెట్ బాటిల్స్”తో టీ షర్టులు, బ్లేజర్లు… ఏకంగా 90 కోట్ల టర్నోవర్
పెట్ బాటిల్స్‌తో హైదరాబాదులో బస్ స్టాప్ తయారు చేయడం విన్నాం. ఆ బస్ స్టాప్ పూర్తిగా పెట్ బాటిల్స్‌తోనే చేశారు. ఇప్పుడు మరో అద్భుతం తెరపైకి వచ్చింది. ఎనిమిది పెట్ బాటిల్స్ వుంటే ఒక టీ షర్ట్ రెడీ అయిపోతుంది. 20 నుంచి 40 పెట్ బాటిల్స్ వుంటే ఏకంగా ఓ బ్లేజర్ రెడీ అవుతుంది. ఇదే ఎకో లైన్ బ్రాండిరగ్‌తో దుస్తులను తయారు చేసి, ఏకంగా 80 నుంచి 90 కోట్ల టర్నోవర్ ను సాధించారు. ఆయనే సెంథిల్ శంకర్. పర్యావరణాన్ని రక్షించడానికే తాము ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నాడు.
పెట్ బాటిల్స్‌తో ఎలా చేస్తారంటే….
పెట్ బాటిల్స్‌కి వున్న మూతలు, రేపర్లను తొలగిస్తారు. ఆ తర్వాత క్రషింగ్ మెషిన్‌లో వేసి వాటిని చిన్న ముక్కలు చేస్తారు. ఆ ముక్కలను వేడి చేసి, కరగబెట్టి ఫైరబర్‌గా మారుస్తారు. ఈ ఫైబర్ దారాలతో వస్త్రాన్ని రూపొందిస్తారు. క్లాత్‌తో మనకు కావల్సిన టీషర్టులు, జాకెట్, బ్లేజర్లు వంటి రకరకాల వస్త్రాలను తయారు చేస్తారు. అయితే.. వీటిని తయారు చేయడం కష్టంతో కూడుకున్న పనే కానీ.. ధర మాత్రం చాలా తక్కువగా వుంటుందని, 5 వేల నుంచి 6 వేల వరకు వుంటుందని నిర్వాహకులు తెలిపారు.
వస్త్రాలు ధరించిన తర్వాత… తిరిగి వారికే ఇచ్చేయవచ్చు…
అయితే.. రీసైకిల్ చేసిన పెట్ బాటిల్స్‌తోనే వస్త్రాలు తయారు చేశామని ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి తమకు చాలా సమయం పట్టిందన్నారు. దీని కోసం కస్టమర్లకు అర్థం చేయడానికి వెబ్‌సైట్‌లో మొత్తం మేకింగ్ ప్రక్రియను వీడియో రూపంలో చూయించామని సెంథిల్ పేర్కొన్నారు. అయితే.. మిగతా కంపెనీలు కూడా తాము చేస్తున్న పనికి మద్దతిచ్చాయని ,అందుకే తమకు లాభాలు వచ్చాయన్నారు. ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌ని రీసైక్లింగ్ చేసే పనిలో నీటిని అతి తక్కువగా వాడుతారు. బొగ్గును కూడా వాడుతారు. చాలా వరకు అంటే.. 90 శాతం సోలార్ ఎనర్జీపైనే ఆధారపడతారు. బాటిల్స్ వల్ల ఉత్పత్తి అయ్యే దాదాపు 10 వేల టన్నులు కార్బన్‌డయాక్సైడ్ ఉద్గారాలను కూడా ఈ ప్రక్రియతో నిరోధించారు. అయితే… ఇలా పెట్ బాటిల్స్‌తో తయారు చేసిన దుస్తులు వాడిన తర్వాత… తిరిగి ఆ కంపెనీకే ఇచ్చేయవచ్చు. వాటిని మళ్లీ రీసైక్లింగ్ చేస్తుంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఇలా పెట్ బాటిల్స్‌తో తయారు చేసిన వస్త్రాలను తాము తయారు చేస్తున్నామని సెంథిల్ శంకర్ తెలిపారు. ప్లాస్టిక్ బాటిల్స్ సంఖ్య నిమిషానికి మిలియన్లలో వుంటోందని, ఒక్క బాటిల్ డీకంపోజ్ కావాలంటే నాలుగు వందల ఏళ్లు పడుతుందని, అందుకే ఈ దారిని ఎంచుకున్నామని తెలిపారు. తమ వంతు బాధ్యతగా చెన్నైకి మూడు వందల కిలోమీటర్ల దూరంగా వృథాగా పడి వున్న ప్లాస్టిక్ బాటిళ్లనన్నింటినీ సేకరిస్తున్నామని, తమ ఫ్యాక్టరీలో రోజుకి 15 లక్షల బాటిళ్ల దాకా రీసైక్లింగ్ చేస్తున్నామని తెలిపారు.