సేంద్రీయ ఎరువుల బ్రాండ్ తయారు చేసి… దేశంలోనే మోడల్ గా నిలిచిన దక్షిణ కన్నడ ప్రాంతం
రసాయనిక ఎరువులను విరివిగా వాడడం వల్ల ఆహారోత్పత్తులు విషపూరితంగా మారుతున్నాయి. మొలకెత్తిన ప్రారంభ దశ నుంచే కోత చివరి దశ వరకూ రసాయనాలే వుంటున్నాయి. దీంతో కొందరు సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా కంపోస్ట్ మరియు ఎరువులు వంటి సహజ ఎరువుల వాడకం కూడా పెరిగింది.ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అనేక చర్యలను ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో వ్యర్థాల నిర్వాహణకి సంబంధించిన యూనిట్ల ఏర్పాటు అనేక ఓ ముఖ్యమైన దశగా మనం చెప్పుకోవచ్చు. సేంద్రీయ వ్యర్థాలను ప్రాసెస్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. వీటిని సేంద్రీయ ఎరువులుగా మార్చే వ్యవస్థ ఇందులో వుంటుంది. స్థిరమైన పంటలను పండించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇలా చేయడం ద్వారా రసాయన ఎరువులపై రైతులు ఆధారపడటాన్ని తగ్గించొచ్చు. అలాగే పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించవచ్చు. అంతేకాకుండా మిద్దె తోటలంటూ ఈ మధ్య బాగా పెరిగిపోయాయి. ఇందులో ఎరువుల కోసం కూడా దీనిని వాడొచ్చు. ఇలా చేయడం ద్వారా రైతులను స్వయంసమృద్ధకులుగా మార్చడంతో పాటు వాణిజ్యపరంగా కూడా ఈ ఎరువులకు బాగా డిమాండ్ పెరుగుతుంది.
ఇలా చేయడం ద్వారా రసాయన ఎరువుల డిమాండ్ కూడా తగ్గించవచ్చు. సేంద్రీయ వ్యర్థాల నుంచి అధిక నాణ్యగత గల సేంద్రీయ ఎరువుల ఉత్పత్తి అనేక ఓ పెద్ద ప్రాసెస్. దీనికి వివిధ సూక్ష్మ జీవులు బ్యాక్టీరియా, పురుగుల ప్రమేయం చాలా అవసరంగా నిపుణులు చెబుతుంటారు. ఈ జీవులు సేంద్రీయ పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడంలో, పోషకాలు అధికంగా వుండే కంపోస్ట్ గా మార్చడంలో ఎంతో సహాయకారిగా వుంటాయి. దీంతో మొక్కల పెరుగుదలకు ఎంతో ప్రయోజనకారిగా వుంటాయి. ఈ ప్రక్రియ మొత్తంలో వానపాములు అత్యంత కీలక పాత్ర. సేంద్రీయ వ్యర్థాలను పెద్ద మొత్తంలో అత్యంత వేగంగా విలువైన ఎరువులుగా మార్చే శక్తి వాటికి వుంటుంది. వానపాముల పాత్ర కీలకంగా వుండటంతో కంపోస్టింగ్ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా జరుగుతుంది. ఎరువుల ఉత్పత్తి అయిన తర్వాత పురుగులు వేరు చేసే ప్రక్రియ కూడా వుంటుంది. పునరుత్పత్తికి అనుకూలమైన పరిస్థితులను తయారు చేయబడతాయి.
అయితే.. దక్షిణ కన్నడ జిల్లాలోని ఉజిరే గ్రామ పంచాయతీ ఈ కంపోస్టు పురుగులపై పరిశోధన చేసి మరో అడుగు ముందుకేసింది. ఈ గ్రామ పంచాయతీ వారు ‘‘ఉజిరే జెన్యా’’ అనే సేంద్రీయ ఎరువుల బ్రాండ్ నే తయారు చేశారు. అభివృద్ధి చేసి, వార్తల్లోకెక్కారు. ప్రస్తుతం మార్కెట్ లో ఈ సేంద్రీయ ఎరువుల కంపోస్టు అందుబాటులో వుంది. ఈ గ్రామ పంచాయతీ ఏదైతే చొరవ చూపించిందో పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయానికి కారణమైంది. అలాగే స్థానికంగా ఓ ఆర్థిక వ్యవస్థను కూడా సృష్టించింది. పలువురికి ఉపాధి సూచిస్తోంది.