మహా కుంభమేళా సంకల్పానికి సంబంధించిన పండగ : దత్తాత్రేయ హోసబళే
మహా కుంభమేళా ఓ జనసమూహం కాదు.. అదో అద్వితీయ భక్తుల సంగమం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే అభివర్ణించారు. ఇది కేవలం సనాతన సంస్కృతికి సంబంధించిన సంగమం కాదని, సంకల్పానికి సంబంధించిన గొప్ప పండగ అని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు దత్తాత్రేయ హోసబళే మహా కుంభమేళాలో వుంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు కూడా హిందూ మతం, సంస్కృతి, ప్రవర్త ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకొని, అందరూ పాటించాలన్నారు.సమాజంలోని సజ్జనులు, సాధువులు, సంతులు, ప్రభుత్వాల సమన్వయ ప్రయత్నాల ద్వారా మాత్రమే సంస్కృతి రక్షించబడుతుందన్నారు. అలాగే ప్రచారం కూడా సాధ్యమవుతుందన్నారు.