భారతీయ జ్ఞాన పరంపరపై కావాలనే గందరగోళం సృష్టించారు : హోసబళే

భారత దేశంలో సంప్రదాయం ప్రాథమికంగా జ్ఞాన సంప్రదాయమని, దాని నుంచే కీర్తి, శ్రేయస్సు కలిగాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘‘ప్రపంచ పుస్తక మేళా’’ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ‘‘మంత్రం – విప్లవం’’ అన్న పుస్తకాన్ని హోసబళే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞాన సంప్రదాయం విషయంలో మన పూర్వీకులు అత్యంత స్పష్టతతోనే వున్నారన్నారు. జ్ఞానం ఒకవ్యక్తిని సరైన దిశలో నడిపిస్తుందని, అయితే.. జ్ఞానంతో పాటు భక్తి కూడా అవసరమేనని నొక్కి చెప్పారు. భక్తి లేని జ్ఞానం వ్యక్తిని అహంకారం వైపు తీసుకెళ్తుందని వివరించారు.
dattaji23
భారత్ లో మరో మూడు విషయాలను సాధించాల్సిన అవసరం వుందని మహర్షి అరవిందో నొక్కి చెప్పారని, అందులో మొదటిది చెల్లాచెదరుగా వున్న పురాతన జ్ఞాన సంప్రదాయాన్ని సేకరించాలని, ఇక రెండోది.. ఈ పురాతన జ్ఞానాన్ని ప్రస్తుత కాలానికి అనుగుణంగా మానవాళికి అనుగుణంగా మార్చాలని, మూడోది కొత్త జ్ఞానాన్ని కూడా సృష్టించాలని చెప్పేవారన్నారు.
dattaji2
ఇక.. భారతీయ జ్ఞాన సంప్రదాయం, జ్ఞాన పరంపరమై మరిన్ని పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు.ఇక.. భారతీయ జ్ఞాన సంప్రదాయంపై కొందరు తప్పుడు కథనాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాగే సత్యాన్ని, చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు కూడా జరిగాయన్నారు.అయితే ఇదంతా ఏదో అజ్ఞానంతో జరిగిందని కాదని, ఒక అజెండాలో భాగంగానే జరిగిందన్నారు. దీని ద్వారా సమాజంలో గందరగోళం సృష్టించే ప్రయత్నం కూడా జరిగిందన్నారు.
ఇక.. బీజేపీ నేత సుధాంశు త్రివేదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సమాజంలోని మేధో వ్యవస్థలోని ఓ వర్గం మెకాలే, మొఘలులు, మార్క్స్ కి బానిసలుగా మారిందని మండిపడ్డారు.సమాజం రెండు రకాల సవాళ్లను ఎదుర్కొంటుంది: కనిపించేవి మరియు కనిపించనివని, ఇవి ఇన్ఫెక్షన్ల వంటివన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *