దీపాలతో మరింత ప్రకాశవంతమైన అయోధ్య… గిన్నీస్ రికార్డుల్లోకి

దీపావళి పర్వదినం సందర్భంగా అయోధ్యలోని సరయూ నది తీరాన దీపోత్సవాన్ని మహాద్భుంగా నిర్వహించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపోత్సవ్ ను ప్రారంభించగా… భక్తులు ఏకకాలంలో 25 లక్షల 12 వేల 585 దీపాలు వెలిగించారు. దీంతో గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇందుకు సంబంధించి 55 ఘాట్ లలో ఏర్పాటు చేసిన ప్రమిదలను ప్రత్యేక డ్రోన్లతో గిన్నీస్ ప్రతినిధులు లెక్కించారు. మరోవైపు గత కొన్ని సంవత్సరాలుగా సీఎం యోగి సరయూ నదీ తీరాన దీపోత్సవ్ నిర్వహిస్తూనే వస్తున్నారు. ఈ సారి మాత్రం భవ్యమైన రామ మందిర నిర్మాణం అక్కడ జరిగింది. దీంతో ఈ దీపోత్సవ్ కి మరింత శోభ చేకూరినట్లైంది. మరోవైపు 1121 మంది వేదాచార్యులు కలిసి హారతి నిర్వహించారు. సీఎం యోగి సాయంత్రం అవిరల్ సరయూ తీరేబనే ఘాట్ లో హారతి నిర్వహించారు. 1121 వేదాచార్యులు అదే రంగు దుస్తులు ధరించి, ఏక స్వరంతో సరయూ హారతి నిర్వహించారు.
అయోధ్య పురవీధుల్లో లక్షలాది జనవాహిన మధ్య రామలక్షణ వేషధారులు రథంపై ఊరేగగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రథం లాగి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. లేజర్ షోలు, డ్రోన్ షోలు, రామాయణ ఘట్టాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అయోధ్య మారుమోగింది. మయన్మార్, నేపాల్, మలేషియా, కంబోడియా, థాయ్‌లాండ్, ఇండోనిషా, భారతీయ కళా ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ దీపోత్సవ్ మనందరికీ గర్వకారణమని అన్నారు. ఇది మనమంతా జరుపుకుంటున్న 8వ దీపోత్సవమని చెప్పారు. ఎనిమిదేళ్ల క్రితం తొలి దీపోత్సవ్ జరుపుతున్నప్పుడు… యోగీజీ రామమందిరం నిర్మించడని ప్రతి ఒక్కరూ అడిగేవారని, రాముడు త్వరలోనే మనందరికీ ఆశీర్వదిస్తాడని ఆరోజు చెప్పడం జరిగిందని గుర్తుచేశారు. రామాలయ నిర్మాణం కలసాకారమైనందుకు ప్రధాని మోదీకి మనమంతా కృతజ్ఞతలు చెప్పుకోవాలని అన్నారు. యావద్దేశం కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్న సమయంలో ప్రధాని అయోధ్యకు వచ్చిన రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని అన్నారు. ఈరోజు అయోధ్య వెలిగిపోతోందని, ఇవాళ వెలుగుతున్నవి కేవలం దివ్వెలు కావని, సనాతన ధర్మ విశ్వాసని చెప్పారు. ”ఈరోజు మన కాశీ వెలిగిపోతోంది. భవ్య కాశీని ఈరోజు యావత్ ప్రపంచం చూస్తోంది” అని గర్వంగా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *