నీటిని వృధా చేస్తే 2000 రూపాయల జరిమానా … డిల్లీ సర్కార్ నిర్ణయం
బెంగళూరుకి ఎదురైన కరువు పరిస్థితి డిల్లీని తాకకుండా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటి వృథాని అరికట్టేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎవరైనా నీటిని వృథా చేస్తే 2000 రూపాయల జరిమానా విధిస్తామని ఢల్లీి మంత్రి అతిశీ ప్రకటించారు. పైపులతో కార్లను కడగడం, వాటర్ ట్యాంకర్లు ఓవర్ ఫ్లో అయినా, ఇతర వాహనాలేవీ కడిగినా, భవన నిర్మాణాలకు, వాణిజ్య అవసరాలకు నీటిని వాడినా.. ఈ రెండు వేల రూపాయల ఫైన్ కట్టాల్సిందేనని ప్రభుత్వం తెలిపింది. మహా నగరంలో నీరు ఎక్కడ వృథా అవుతుందో నిత్యం పరిశీలించడానికి డిల్లీ వాటర్ బోర్డుకు చెందిన 200 మంది ఉద్యోగులను రంగంలోకి దింపనున్నట్లు కూడా ప్రకటించారు. వాణిజ్య భవనాలకు గానీ, మరే ఇతర భవనాలకుఅయినా సరే… అక్రమ నీటి కనెక్షన్లు వుంటే వెంటనే తొలగించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.