ధాన్యo తడవకుండా కాపాడే ”మంచే” … అతి తక్కువ ఖర్చు… లాభం ఎక్కువ
రైతులు అత్యంత కష్టపడి పంటను పండిరచుకుంటారు. కళ్లంలో ధాన్యాన్ని ఆరబెట్టుకోవడంలోనూ చాలా ఇబ్బందులు వస్తాయి. ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత ఒక్కసవరిగా వర్షం పడితే.. రైతు పరిసస్థతి ఏంటి? వర్షానికి బాగా తడిససన ధాన్యాన్ని అమ్మడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుంది. పండిరచిన పంట నీటిపాలు కాకుండా వుండేందుకు ససంగరేణి మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ వినూత్న ఉపాయాన్ని ఆలోచించి, వెల్లడిరచారు. అదే ‘కంచె’ పద్ధతి.
కల్లెం దగ్గర అయినా, లేదా పొలంలో అయినా… దీనిని నిర్మించుకోవచ్చు. పొలంలో అయితే ప్లస్ ఆకారంలో సఱమారు 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తుగల మంచెను శాశ్వతంగా వేయాలి. దీర్ఘచతురస్రాకార పొలం అయితే, పొడుగ్గా దీనిని నిర్మించాలి. దీనికి పొలం గట్లపై వుండే రెండు లేక మూడు చెట్లు కొట్టేయాలి. తాటి మొద్దులను 5 అడుగుల ముక్కలు చేసస,భూమిలోకి 2 అడుగులు, భూమిపైన 3 అడుగులు ఎత్తున వుండేలా చూడాలి. రెండు మొద్దుల మధ్య దూరం 6 అడుగులు కచ్చితంగా వుండాలి.
దీని మీద జీఐ చెయిన్ లింక్ ఫెన్సింగ్ లేదా మెటల్ ఫెన్స్, రోజ్ హెడ్ నెయిల్స్ సహకారంతో వ్యవసాయ సీజన్లో ప్రారంభం కాగానే అమర్చుకోవాలి. అకాల వర్షం వచ్చే అవకాశం వుందని తెలిసిన సమయంలో ఈ మంచె పైన టార్పాలిన్ షీట్ పరచాలి. దానిపైన ధాన్యాన్ని పోసు కోవాలి. ఆ తర్వాత ధాన్యంపైన కూడా టార్పాలిన్ షట్ కప్పి, చైన్ లింక్ ఫెన్స్‌సి తాళ్లతో గట్టిగా కట్టాలి. వర్షం నుంచి మాత్రమే కాకుండా పెద్ద గాలి అయినా, తుపాను అయినా, వరదలు వచ్చినా… ధాన్యం తడవకుండా సురక్షితంగా వుంటుంది. అప్పుడు ధర తగ్గించి అమ్ముకోవాల్సిస అవసరం రైతుకి అస్సలు వుండదు.