రామ్ కథ మ్యూజియంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు
భవిష్యత్ తరాలకు పురాతన వైభవాన్ని అందించాలని అయోధ్య రామమందిర నిర్మాణ సమితి మరో ముఖ్యమైన ముందడుగు వేసింది. అయోధ్యలోని సరయు నది ఒడ్డున ఉన్న రామ్ కథ మ్యూజియంలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడం అనేది అత్యంత ప్రశంసనీయమైన విషయం.. రామ్ మందిర్ నిర్మాణ్ సమితి ఇటీవల జరిగిన సమావేశంలో, మ్యూజియం కాంప్లెక్స్‌లో అత్యాధునిక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ డిజిటల్ లైబ్రరీ లక్ష్యం చారిత్రక పత్రాలు , అరుదైన వస్తువులను సంరక్షించడమే కాకుండా, పరిశోధన కోసం, అధ్యయనం కోసం అందుకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా వాటిని అందుబాటులో ఉంచడం. దీనిలో, ఉద్యమానికి సంబంధించిన కేసుల పత్రాలు, చారిత్రక ఫోటోలు, ఇంటర్వ్యూలు, మీడియా నివేదికలు , కోర్టు ఉత్తర్వులు వంటి ఇతర ముఖ్యమైన రికార్డులను డిజిటలైజ్ చేసి అప్‌లోడ్ చేస్తారు. రామకథ మ్యూజియంలో ప్రతిపాదించబడిన ఈ డిజిటల్ లైబ్రరీ ఆధునిక భారతదేశ సాంస్కృతిక , మతపరమైన ఉద్యమంలో అతిపెద్ద డిజిటల్ నిధిగా మారబోతోంది.
ఇది ఆలయ ఉద్యమాన్ని మతపరమైన దృక్కోణం నుండి మాత్రమే కాకుండా సామాజిక, రాజకీయ, న్యాయ సైద్ధాంతిక దృక్కోణం నుండి కూడా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ చొరవ భవిష్యత్ తరాలకు సాంస్కృతిక-చారిత్రక ఎన్సైక్లోపీడియాగా పనిచేస్తుందని నిర్మాణ కమిటీ అధికారులు తెలిపారు. భవిష్యత్ తరాలకు ఏది నిజం, ఏది అబద్ధం అనే విషయంపై ఎటువంటి గందరగోళం లేకుండా అన్నీ డిజిటలైజ్ అవడం వల్ల సులభతరం అవుతుందని చెప్పారు.
ఆలయ ఉద్యమంపై లోతైన అధ్యయనం చేయాలనుకునే పరిశోధకులకు ఈ లైబ్రరీ ఒక వరంలా నిలుస్తుంది. దీనిలో ఉన్న విషయాలను ఆన్‌లైన్ పోర్టల్‌లు , ప్రత్యేక యాప్‌ల ద్వారా అందుబాటులో ఉంచుతారు. దీని ద్వారా, భారతీయ పరిశోధకులే కాకుండా విదేశాలలోని వారు కూడా రామమందిర ఉద్యమం చారిత్రక ప్రయాణం గురించి తెలుసుకోగలుగుతారు.