కనుమరుగైన విప్లవ వీరులు – నారాయణబాబు
హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర
2వ భాగం
జిన్నా ఉపన్యాసం
1947 ప్రారంభంలో మహమ్మదాలీ జిన్నా హైద్రాబాద్ వచ్చి ఒక పెద్ద సభలో ప్రసంగించాడు. జనాన్ని రెచ్చగొట్టే విధంగా పరుషంగా మాట్లాడాడు. నారాయణబాబు ముసల్మాను వేషంలో అక్కడికెళ్ళి ఉపన్యాసం విన్నాడు. ‘‘కోడి మెడలను విరిచినట్లుగా హిందువులను విరిచేస్తాం. ముల్లంగి కాడల్లా త్రుంచివేస్తాం’’ అని మహా ఉద్రేకంగా మాట్లాడాడు. నారాయణబాబు రక్తం ఉడుకెత్తింది. హృదయం విక్షుబ్దం (విషణ్ణం) కాగా ఏదో ఒకటి చెయ్యాలనే తపన తీవ్రం అయ్యింది. కాయదే ఆజం జిన్నా ప్రసంగం నారాయణబాబు జీవితాన్ని ఒక మలుపు దగ్గర నిలుచోబెట్టింది. బాలకృష్ణ, నారాయణ తమ విప్లవ సహచరులను సమీకరించి కార్యక్రమాలను నిర్ణయించుకున్నారు. అడుగడుగునా ధనాభావం, ఆయుధాల వెలితి ఉన్నా, సహనంగా స్వతంత్ర హైద్రాబాద్‌ను తుదముట్టించాలనుకున్నారు.
నారాయణబాబు, బాలకృష్ణలతో పాటు నారాయణ స్వామి (మాజీ నిజాం రైల్వేలో కో ఆఫీసర్), విశ్వనాథ్ (గన్‌ఫౌండ్రీ), రెడ్డి పోచ్‌నాథ్, గంగారాం పాలంకోల్, జగదీష్ ప్రధానంగా రహస్య మంతనాలు సాగించారు. మొట్టమొదట ప్రయో గంగా నిజాం సైనికదళానికి చెందిన రిజర్వ్ పోలీసు అశ్వికదళం ఉన్న ప్రాంతాన్ని టైంబాంబుతో ధ్వంసం చేయాలని నిశ్చయించుకున్నారు. ప్రజలలో చైతన్యం కలిగించాలని నిజాం దుష్కృత్యాలను ప్రతి ఘటించే జనం ఉన్నారనే అంశం తెలియచేయాలనీ, ప్రయోగా త్మకంగా ఈ పని చేసి చూడాలనే నిర్ణయానికి వచ్చారు. సిటీ కాలేజీకి పశ్చిమంగా ఉన్న రిజర్వ్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ దగ్గరలో (పేటలా బురజ్ దగ్గర) అశ్వికదళం తబేలా, రిజర్వ్ పోలీసు కార్యాలయాలు ఉండేవి. రోడ్డుకు మరోప్రక్కన పోలీస్ బ్యారక్స్ కూడా ఉండేవి. పథకం ప్రకారం నిర్ణీత స్థలంలో నారాయణ బాబు గంగారాంలు వెళ్ళి అతిరహస్యంగా టైంబాం బును నాటి వచ్చారు. రాత్రి సరిగ్గా రెండు గంటలకు ప్రేలుడు జరిగింది. తబేలా పైకప్పు లేచిపోయి అగ్ని వ్యాపించింది. కొన్ని గుర్రాలు తీవ్రంగా కాలి గాయపడ్డాయి. వేలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఆ తర్వాత గూఢచారి శాఖ ఎంతో గాలించింది. కాని ఎవరూ పట్టుబడలేదు. నారాయణబాబు, ఆయన సహచరులు సాధించిన ప్రప్రథమ విజయం అది.
నిజాం తన హైద్రాబాద్ సంస్థానంలో హిందు వులను అణచివేయాలనే ప్రయత్నంలో భాగంగా ముస్లిం జనసంఖ్యను పెంచుతున్నాడు. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి వేలాదిమంది మహమ్మ దీయులను తీసుకువచ్చాడు. ప్రత్యేకించి రైల్వేవాళ్ళు స్పెషల్ ట్రైన్సు ద్వారా కాందిశీకులను తరలించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ లోక్‌సభలో ప్రకటనచేస్తూ హైద్రాబాద్‌లో ఎనిమిది లక్షల మంది కాందిశీకు లకు నివాసం ఏర్పాటు చేశారని, అందులో పదివేల నాలుగువందల మందిని నిజాం తన సైన్యంలో చేర్చుకున్నాడని చెప్పారు. ఇలాంటి వాతావరణంలో ప్రతిఘటన కొన సాగాలని నారాయణబాబు స్నేహితులు తీవ్రంగా ఆలోచించారు. మొదట రెఫ్యూజీ గుంపులను తగులబెట్టాలని అనుకున్నారు. చేతి బాంబు కావాలని శ్రీ వందేమాతరం రామచంద్రరావుని కోరారు. కాని అది తరుణం కాదని ఆయన సలహా ఇచ్చారు. అయినా నారాయణబాబు నిరుత్సాహం చెందక స్వయంగా ప్రయత్నాలు కొనసాగించాడు. చివరకు కాందిశీకుల రైలును పేల్చివేయాలని ఆయన నిశ్చయించు కున్నాడు. రైలును పేల్చివేయటం వలన కాందిశీకులు భయపడి రావడం మానేస్తారని నారాయణబాబు అనుకు న్నాడు. రెఫ్యూజీ ట్రైన్ వచ్చే వేళలు కనుక్కొని కార్యక్రమం రూపొందించుకున్నారు.
బలార్షా నుండి వచ్చే రైలు ఘటకేసర్ గుండా హైదరాబాద్‌కు వస్తోంది. హైదరాబాద్‌కు సుమారు 15 మైళ్ళ దూరంలో ఉన్న ఘటకేసర్ మౌలాలీ స్టేషన్ల మధ్య ఒక చోటును ఎన్నుకున్నారు. నారాయణ బాబు లోకో ఆఫీసులో పనిచేస్తున్న నారాయణ స్వామి, విశ్వనాథ్‌ల సహాయంతో పరికరాలు సంపాదించాడు. నారాయణబాబు రెండు గంటలు కష్టపడి షిష్ ప్లేట్లను తొలగించాడు. నారాయణ స్వామి, విశ్వనాథ్‌లు రెండువైపులా ఉండి కాపలా కాశారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి దగ్గరలో ఉన్న పొదలో దాక్కొని రైలుకోసం చూస్తున్నారు. అనుకోకుండా ఇద్దరు లైన్‌మెన్‌లు చెకింగ్ చేస్తూ వచ్చారు. తొలగించబడిన ఫిష్ ప్లేట్లను చూసి, వచ్చే రైలును ఆపివేశారు. రైలు కూల్చివేత కార్యక్రమం విఫలమైంది. ఆ తర్వాత రైల్వేశాఖ వారు గాంగ్‌మెన్‌లను తీవ్రంగా బాది చూశారు. కానీ ఎవరూ పట్టుబడలేదు.
లక్ష్యసిద్ధికై…
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సయ్యద్ అబ్దుల్ లతీఫ్ ముస్లిం పక్షపాతి. ఒకవిధంగా ద్విజాతి సిద్ధాంతం ఇతని కల్పనే. దాని ఆధారంగానే భారతదేశం ముక్కలై పాకిస్తాన్ ఏర్పడిరది. మతకల్లోలాలు చెలరేగి భయంకర రక్తపాతం ఏర్పడిరది. అయినా డాక్టర్ లతీఫ్ ద్విజాతి సిద్ధాంతాన్ని హైద్రాబాద్‌కు వర్తింప చేయాలని ప్రచారం కొనసాగించారు. ప్రత్యేకించి ఇంగ్లీషులో ‘‘క్లెరియన్’’ అనే వార్తాపత్రిక ఇతని సంపాదకత్వాన వెలువడేది. నారాయణబాబు ఈ వ్యక్తిని హత్య చేయాలని నిశ్చయించుకొని రివాల్వర్‌కోసం ప్రయత్నించాడు. కాని సమయానికి ఎవరూ ఇవ్వలేదు. నారాయణబాబు వెనుకాడక ముస్లిం వేషంలో అఫ్జల్ హుస్సేన్ పేరుతో ఇంటికి వెళ్ళి కలుసుకున్నాడు. డాక్టర్ లతీఫ్ ‘‘క్లెరియన్’’ ప్రతులు కూడా ఇచ్చాడు. వరంగల్‌లో ముస్లిం ఉద్యమాన్ని తీవ్రం చేయాలని, మీలాంటి యువకులే మాకవసరమని డాక్టర్ లతీఫ్ వీపు తట్టాడు. కాని తన కోరిక తీర్చుకోకుండానే నారాయణబాబు తిరిగి రావలసి వచ్చింది.
ఆ తర్వాత నారాయణబాబు తన లక్ష్యసిద్ధికోసం అనేక మార్గాలు అన్వేషించసాగాడు. ఒకసారి నయాపూల్ దగ్గర నిజాం కారులో వెడుతుండగా చూశాడు. రోజూ సాయంత్రం నిజాం అన్ని కట్టు దిట్టాలతో నగరంలో నుండి కారులో వెళుతుండే వాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిజాంను తుదముట్టించాలని నారాయణబాబు నిశ్చయించు కున్నాడు. నిజాం హత్యవల్ల అతని ఇద్దరి కొడుకుల్లో ఘర్షణ రేగవచ్చు. హిందువుల మూకుమ్మడి హత్యా ప్రయత్నాలు సాగితే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా జోక్యం చేసుకోవచ్చునని నారాయణబాబు అంచనా. ఏమైఆ తర్వాత నారాయణబాబు తన లక్ష్యసిద్ధికోసం అనేక మార్గాలు అన్వేషించసాగాడు. ఒకసారి నయాపూల్ దగ్గర నిజాం కారులో వెడుతుండగా చూశాడు. రోజూ సాయంత్రం నిజాం అన్ని కట్టుదిట్టాలతో నగరంలో నుండి కారులో వెళుతుండేవాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిజాంను తుదముట్టించాలని నారాయణబాబు నిశ్చయించుకున్నాడు. నిజాం హత్యవల్ల అతని ఇద్దరి కొడుకుల్లో ఘర్షణ రేగవచ్చు. హిందువుల మూకుమ్మడి హత్యా ప్రయత్నాలు సాగితే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా జోక్యం చేసుకోవచ్చునని నారాయణబాబు అంచనా. ఏమైనా బానిసగా బ్రతికేకంటే వీరుడిగా మరణించడమే మేలని భావించాడు. నా బానిసగా బ్రతికేకంటే వీరుడిగా మరణించడమే మేలని భావించాడు.
తనలాగే ఆలోచిస్తున్న మరో బృందంతో పరిచయమైంది. అందులో ముఖ్యులు దేవయ్య, భీష్మదేవ్ ప్రయత్నించగా చివరికి రెడ్డి పోచ్‌నాథ్ ద్వారా ఒక చేతిబాంబు లభించింది. ఆర్యసమాజ్ నాయకులు పండిత నరేంద్రజీ శత్రువుల్ని ఎదుర్కోవ డానికి ఆర్యసమాజ్ కార్యకర్తలకు కొన్ని బాంబులు పంచారు. కాని అవి కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే. ఆ రోజుల్లోనే షోలాపూర్‌లో కీ.శే. రాజ గోపాల్ నిర్వాసితుల శిబిరం నిర్వహిస్తుండే వాడు. అక్కడికి శ్రీ కొండా లక్ష్మణ్ సహాయంతో వెళ్ళి మూడు బాంబులు, రెండు రివాల్వర్లు సంపా దించుకుని నారాయణబాబు హైద్రాబాద్ తిరిగి వచ్చాడు.
(సశేషం)