వస్త్ర ధారణలో హిందూ చిహ్నాలుం వుండొద్దు : డీఎంకే రాజా వివాదాస్పద వ్యాఖ్యలు
అధికార డీఎంకే మరోసారి హిందూ ధర్మంపై తన అక్కసును వెళ్లగక్కింది. డీఎంకే సీనియర్ నేత ఏ. రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ డ్రెస్ కోడ్ (డీఎంకే ధోతి) వేసుకున్న సమయంలో ఏ డీఎంకే నేత కూడా హిందూ చిహ్నాలను ధరించవద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంకుమ పెట్టుకోవద్దని, చేతికి కంకణాలు కూడా కట్టుకోవద్దని రాజా హుకూం జారీ చేశారు. ఇంత చెబుతున్నా… అలాంటి గెటప్ లో వుంటే అన్నాడీఎంకే తరహాలోనే ఇబ్బందులు కూడా వస్తాయంటూ బెదిరింపులకు దిగారు. నీలగిరి జిల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రాజా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
‘‘అన్నాదురై చెప్పినట్లుగా… దేవుడ్ని నమ్మడం మానేయమని నేను మిమ్మల్ని అడగడం లేదు. ప్రేమ, దయ గుణాలున్న దేవుడికి మనం వ్యతిరేకం కాదు.’’ అని రాజా పేర్కొన్నారు. డీఎంకే పార్టీతో అనుసంధానమైన ధోతిని ధరించిన సమయంలో మాత్రం కుంకుమ పెట్టుకోవద్దు అని రాజా స్పష్టం చేశారు. ఎటువంటి ఐడియాలజీ లేని రాజకీయ పార్టీ నాశనం అవుతుందని, దానికి ఉదాహరణ అన్నాడీఎంకే అని తెలిపారు. రాజా చేసిన వ్యాఖ్యపై ఆస్తికవాదులు, హిందువులు, జాతీయవాదులు మండిపడుతున్నారు. ఈ ప్రకటన మతపరమైన విశ్వాసాలపై దాడి చేయడమే అవుతుందని పేర్కొంటున్నారు.