‘వక్ఫ్‌’ అంటే అంకితమా? ఆక్రమణా?

కాశీవిశ్వనాథ దేవాలయం.. గుజరాత్‌లోని బేట్‌ ద్వారకా, తాజ్‌ మహల్‌, ముఖేష్‌ అంబానీ ఇల్లు, హైద్రాబాదులోని Microsoft, Wipro Office, International Business School భవనాలు, తమిళనాడులోని 7 హిందూ మెజారిటీ గ్రామాలతో పాటు అక్కడి 15 వందల ఏళ్ల నాటి ప్రాచీన హిందూ దేవాలయం.. వీటితో పాటు ఢల్లీిలోని 77 శాతం భూమితో పాటు దేశంలోని అనేక ఇతర ప్రాచీన, ప్రసిద్ధ నిర్మాణాలను ఇప్పుడు వక్ఫ్‌ బోర్డు తమవిగా ప్రకటిస్తోంది. అసలేంటి ఈ వక్ఫ్‌ యాక్ట్‌.. దేశవ్యాప్తంగా ఎందుకు చర్చనీ యాంశం అవుతోంది? ఎప్పటి నుండి ఇది మొదలైంది, ఎప్పుడు చట్టంగా మారింది, దీని నష్టం ఏమిటి?… ఒక విశ్లేషణ…

సామాన్య మధ్యతరగతి పౌరుడి నుండి అపర కుబేరులు, ప్రభుత్వాలను కూడా తీవ్రంగా కలవర పెడుతున్న అంశం వక్ఫ్‌. వక్ఫ్‌ అంటే అంకితం చేయబడిన లేదా నిషేధించబడిన అనే అర్థం వస్తుంది. ముస్లిం పర్సనల్‌ చట్టాలు నిర్వ చించిన ఇస్లామిక్‌ మతపరమైన, సేవా కార్యక్రమాల కోసం ఇస్లాం మతానికి చెందిన వ్యక్తి అంకితం చేయడాన్ని వక్ఫ్‌ అంటారు. ఒక్కసారి ఏదైనా ఆస్తి వక్ఫ్‌గా మారితే ఇక అది ఎప్పటికీ వక్ఫ్‌గానే ఉంటుంది. అంకితం ఇచ్చిన వ్యక్తి కూడా దాన్ని వెనక్కి పొందటా నికి అవకాశం లేదు. నిజానికి వక్ఫ్‌ అనే పదం ఖురాన్‌లో లేదు. భారత రాజ్యాంగంలోనూ లేదు.  హదీసుల్లో మాత్రమే వక్ఫ్‌ ప్రస్తావన ఉంటుంది.

భారతదేశంలో 1954లో నెహ్రూ ప్రభుత్వం ముస్లిం వక్ఫ్‌ యాక్ట్‌ను అమలులోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత 1964లో సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసింది. దేశ విభజన ద్వారా పాకిస్థాన్‌ నుండి శరణార్థులుగా భారత్‌ వచ్చిన హిందువుల ఆస్తులను అక్కడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కానీ ఇక్కడి నుండి పాకిస్థాన్‌ వెళ్లిపోయిన ముస్లింల ఆస్తులను మాత్రం ఈ చట్టం ద్వారా వక్ఫ్‌ బోర్డులకు అప్పగించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. 1995లో అదే కాంగ్రెస్‌ ప్రభుత్వం వక్ఫ్‌ యాక్ట్‌ 1954 స్థానంలో వక్ఫ్‌ యాక్ట్‌ 1955 అమలులోకి తీసుకొచ్చింది. 2013లో యూపీఏ ప్రభుత్వం వక్ఫ్‌ యాక్ట్‌ 1995కి సవరణలు చేసి వక్ఫ్‌ బోర్డులకు మరిన్ని అపరిమిత అధికారాలు కల్పించింది. 2014 లోక్‌ సభ ఎన్నికలకు కొంత కాలానికి ముందు ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఢల్లీిలోని 123 కీలకమైన ప్రదేశాల్లోని ఖరీదైన భూములను వక్ఫ్‌ బోర్డుకు సమర్పించింది. ఇటీవల ఆ భూములను కేంద్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది.

వక్ఫ్‌ యాక్ట్‌ 1995 ప్రకారం ఏదైనా ఒక భూమి తమది అని వక్ఫ్‌ బోర్డు వద్ద నమ్మదగ్గ కారణాలు ఉంటె చాలు, అంతకుముందు ఆ భూమి కొనుగోలు విషయంలో జరిపిన లావాదేవీలన్నీ రద్దయినట్లే. ఎందు కంటే.. ఒకసారి వక్ఫ్‌ పరమైతే ఎప్పటికీ అది వక్ఫ్‌కెే చెందుతుంది. వక్ఫ్‌ భూమి వక్ఫ్‌బోర్డు సభ్యులు కూడా అమ్మడానికి వీలు లేదు. భారతదేశంలో వక్ఫ్‌ బోర్డు అనేది ఎవరూ ప్రశ్నించలేని, కోర్టులకు సమానమైన శక్తివంతమైన వ్యవస్థగా మారింది. దానికున్న అధికారాలతో ఏ భూములనైనా తమవిగా ప్రకటించు కోవచ్చు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ స్థలం నుండి మిమ్మల్ని బయటకు గెంటేయవచ్చు. హైదరా బాద్‌ బోడుప్పల్‌లో జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.7 వేల కుటుంబాలు తమ కష్టార్జితంతో డబ్బు కూడబెట్టుకుని నివాస స్థలాలు కొనుక్కుని, వాటిని ప్రభుత్వం దగ్గర చట్టబద్ధంగా రిజిస్టర్‌ చేసుకున్నప్పటికీ వక్ఫ్‌ బోర్డు అధికారానికి రోడ్డుపాలయ్యాయి. ఇప్పటికీ తమ భూముల కోసం హైదరాబాద్‌ రోడ్లపై నిరసన దీక్షలు చేస్తున్నారు. ఈ వక్ఫ్‌ చట్టంలో ఉన్న మరో ప్రమాదకరమైన అంశం ఏమిటంటే.. కేవలం ముస్లిములే సభ్యులుగా ఉన్న వక్ఫ్‌ బోర్డు తీసుకునే నిర్ణయమే అంతిమం. సుప్రీం కోర్టు కూడా వక్ఫ్‌బోర్డు నిర్ణయాన్ని కాదనడానికి లేదు. కానీ ఇటీవల అత్యంత అరుదైన కేసులో మాత్రం సుప్రీంకోర్టు వక్ఫ్‌ బోర్డు నిర్ణయాలను తోసిపుచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *