యుగపరివర్తకులు డాక్టర్‌ హెడ్గెవార్‌

భారతదేశ చరిత్రలో 1857 నుండి 1947 వరకు జరిగిన పరిణామాలు, ఆ మధ్య కాలంలో దేశంలో నిర్మాణమైన పరిస్థితులు వాటి ప్రభావం నుండి ఈ దేశం ఇంకా పూర్తిగా బయట పడలేదు.. ఆ రోజుల్లో నిర్మాణమైన సంఘర్షణ ఇంకా కొనసా గుతూనే ఉన్నది. దానికి ముగింపు పలికినప్పుడే ఈ దేశంలో సుస్థిరత నెలకొంటుంది. ఆ మధ్య కాలంలో ఈ దేశంలోనే అనేమమంది మహా పురుషులు జన్మించారు. ఆ మహా పురుషులలో యుగానుకూల మార్పులకు తెరలేసి పనిచేసిన వారితో పేర్కొనదగిన వారు డాక్టర్‌ కేశవరావు బలరాంపంత్‌ హెడ్గేవార్‌ వారిని డాక్టర్‌ అని పిలుస్తుంటారు. వారు ఉగాది పండుగ రోజున జన్మించారు. 1889 సం. ఏప్రియల్‌ 1న ఒక నిరుపేద కుటుంబంలో డాక్టర్కి జన్మించారు.

సంఘ కార్యాన్ని ప్రారంభించడానికి దారి తీసిన పరిస్థితులను, సంఘ కార్యపు ఆవశ్యకతను డాక్టర్‌జీ చెప్పిన మాటలలో మనం అర్థం చేసుకోవాలంటే ఆ రోజుల్లో డాక్టర్‌జీ ఇచ్చిన తొమ్మిది ఉపన్యాసాలు చదవాలి. వాటిని చదివితే సంఘ కార్యంపట్ల డాక్టర్‌జీ ఆలోచనలు స్పష్టమవుతాయి.

డాక్టర్జీనాటి పరిస్థితులు

ఆ రోజుల్లో రాజుల రాజ్యాలు వ్యవస్థ క్రమంగా కనుమరుగవుతూ బ్రిటీష్‌ ప్రజాస్వామ్య వ్యవస్థ భారత్‌లో నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయమది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేసే అనేక రాజకీయ పార్టీలు కూడా పుట్టుకొస్తున్న సమయమది. ఇంకొక ప్రక్క ద్విజాతి సిద్ధాంతంతో ముస్లింలకు ఒక దేశాన్ని సాధించాలని ముస్లింలీగ్‌ పనిచేస్తున్నది. ముస్లిం జనాభా విపరీతంగా పెరగడం అనే సమస్య కూడి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ముస్లిం ప్రాజల్యం పెరుగుతున్నది. దానిని నిరోధించడానికి ఆర్య సమాజ్‌ తన శక్తియుక్తుల్ని ఒడ్డి పనిచేస్తున్న సమయమిది. బ్రిటిష్‌ వాళ్ళు ఈ దేశంలో తమ పరిపాలను సుస్థిరం చేసుకొనేండుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న సమయమది. తమ వలసవాదాన్ని సమర్థించుకొనేందుకు ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని బ్రిటిష్‌ వారు మనపైకి వదిలిన సమయమది. బ్రిటిష్‌ వాళ్ళు ఈ దేశం మొత్తాన్ని సర్వే చేసి అనేక విషయాలు అర్థం చేసుకుంటున్న సమయమిది. ఈ దేశ ప్రజలు ఈ దేశాన్ని మరిచిపోయేటట్లుగా, ఈ దేశం యెడల ఒక ఉదాసీన వైఖరి జనించే విధంగా అనేక కుట్రలు జరుగుతున్న సమయం. అందులో ఈ దేశం యొక్క చరిత్రను వక్రీకరిండం. ఈ దేశ చరిత్రను 1. ఈ దేశం మీద దాడిచేసిన విదేశీ దురాక్రమణ దారులను, వారిని ఎదిరించి పోరాటం చేసిన వారిని ఇద్దరిని ఒక గాటన కట్టివేసి చరిత్రను మనలో చదివించటం ప్రారంభించిన సమయమది. ఆ సమయంలోనే ప్రారంభమైన కమ్యూనిస్టు పార్టీ కూడా తమ సిద్దాంతాలకు అనుగుణంగా ఈ దేశ చరిత్రకు వ్యాఖ్యానాలు చేస్తున్న సమయమది. క్రమక్రమంగా వేల సంవత్సరాలుగా ఈ దేశాన్ని కలిపి ఉంచుతున్న ఈ దేశ సంస్కృతి, సాంప్రదాయాలను ఈ దేశ ధర్మాన్ని, ఈ దేశ జాతీయతకు ప్రశ్నార్థకం చేసే మేధావివర్గం పుట్టుకువచ్చి పనిచేస్తున్న సమయమది. ‘‘నేను హిందువును’’ అని చెప్పుకునేందుకే సిగ్గుపడేలా వాతావరణం క్రమంగా దేశమంతా విస్తరిస్తున్న సమయమది. ఇస్లాం, క్రైస్తవం మతం మార్పిడులు జోరుగా సాగుతున్న సమయమది. ఇంకొక కీలక పరిణామం ఈ దేశంలో రాజ్యశక్తి సర్వస్వం అవుతున్న వేళ అది. ఎన్నికలు, బలాబలాల పరీక్ష మొదలవుతున్న సమయమది. ఈ పరిస్థితులలో ఈ దేశాన్ని ఈ దేశంగా నిలబెట్టడం ఒక పెద్ద సవాలుగా నిలబడిరది.

దేశకార్యం…

ఆ సవాలును స్వీకరించి డాక్టర్‌జీ సంఘ కార్యాన్ని ప్రారంభించారు. హిందూ సమాజ సంఘటనా కార్యానికి రెండు విశేషాలు జోడిరచారు.

  1. సంఘ కార్యం ఈశ్వరీయ కార్యం 2 సంఘ కార్యం రాష్ట్రీయ కార్యం. ఈ రెండు మాటలతో సమాజ సంఘటన కార్యాల గురించి డాక్టర్‌జీకి గల కల్పన మనకు అర్థమవుతుంది. డాక్టర్‌జీ హిందూ సమాజానికి సంబంధించి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ‘‘ఇది హిందూ రాష్ట్రము. ఇది ఒక శాశ్వత సత్యం. మనం అందరం బంధువులం. ఈ హిందూ సమాజాన్ని సంఘటిత పరచడమే మన లక్ష్యం’’ ` ఇదీ డాక్టర్‌జీ విశ్లేషణ.

విశాల వటవృక్షం

 దూరదృష్టితో ఆలోచించి ప్రారంభించిన ఈ కార్యం.  ఈ రోజున దేశమంతా విస్తరించడమే కాదు ప్రపంచంలో అనేక దేశాలకు విస్తరించి ఇక్కడ ఉన్న హిందువులను సంఘటితపరుస్తున్నది. ఈ దేశంలోని అన్ని జీవనరంగాలలో స్వయంసేవకులు ప్రవేశించి ఆ రంగాలను శక్తివంతం చేసేందుకు కృషిచేస్తున్నారు. సంఘం ఈ రోజున ఒక నిర్ణయాత్మక శక్తిగా సమాజంలో ఉంది. ఈ దేశహితం గురించి ఆలోచించే వారెవరైనా, ఈ దేశానికి నష్టం కలిగించాలని ఆలోచించే వారెనరైనా సంఘాన్ని విస్మరించే పరిస్థితి ఈరోజు లేదు. రాజకీయాలకు అతీతంగా అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. వాటన్నింటికి ప్రేరణ ప్రోత్సహిస్తున్నది సంఘం.

డాక్టర్జీ, అంబేద్కర్‌

ఒక ప్రశ్న డాక్టర్‌జీ హిందూ నమాజ సంఘటన కార్యము, రెండవ ప్రక్క డాక్టర్‌ అంబేడ్కర్‌ సామాజిక ప్రజాస్వామ్యం కోసం ప్రయత్నం. డాక్టర్‌జీ ప్రతిపాదించిన హిందూ సమాజ సంఘటన కార్యంలోనే సామాజిక ప్రజాస్వామ్యం ఉన్నది. సమాజంలోని అందరిని కలుపుకుని పోవటం అనేదే మూలసూత్రం. అంబేద్కర్‌ ప్రతిపాదించిన సామాజిక ప్రజాస్వామ్యంలో ‘‘సామాజిక ప్రజాస్వామ్యమనేది ఒక జీవన విధానం. దీనిలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఉండాలనేది వారి సూత్రం. ఈ మూడు ఒకదానితో ఒకటి మమేకమవ్వాలనేది వారి ఆలోచన. స్వేచ్ఛ లేని సమానత్వము వ్యక్తిగత చొరవను చంపేస్తుంది. సమానత్వం లేని స్వేచ్ఛ వ్యక్తుల అధిపత్యాన్ని నెల కొలుపుతుంది. సోదరభావం లేని స్వేఛ్ఛ, సమానత్వం సహజంగా ఉండలేవు’’ అని అంబేద్కర్‌ ఆలోచనలు. డాక్టర్‌జీ ఈ దేశంలోని మన మందరం ఈ హిందూ సమాజం  అవయన స్వరూపులం అని చెప్పారు. దానిలోనే అన్ని ఉన్నాయి. సమాన ఆటోచనలు కలిగిన వారినందరిని సంఘానికి దగ్గరగా తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేశారు. సంపూర్ణ హిందూ సమాజం శక్తివంతంగా నిలబడాలి. రాజ్యశక్తిని అదుపులో ఉంచగలిగే ఒక సామాజికశక్తి సమాజంలో నిర్మాణం కావాలి. దానికోసం డాక్టర్‌జీ పనిచేశారు.

విఘటనశక్తులు వీగిపోతున్నాయి

ఈ రోజున దేశంలో సంఘం శక్తివంతంగా ఉంది. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు క్రమంగా బలహీనమవుతున్నాయి. ఈ దేశంలో గందరగోళం సృష్టించే సిద్ధాంతాలు కూడా క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. ఈ రోజు దేశంలో మేము హిందువులం అని చెప్పుకొనేందుకు ఎవరూ సిగ్గుపడటం లేదు. దేశహితం గురించి అలోచిస్తూ పనిచేస్తున్న శక్తులన్నింటిని సమన్వయపరిచే ప్రయత్నం ఈ రోజున కూడా జరుగుతున్నది.  డాక్జర్‌జీ ఆలోచనల సాకార రూపం ఈ రోజు మనం చూస్తున్నాము. అటువంటి మహనీయులు ఉగాది పండుగ రోజున జన్మించి ఈ యుగానికి ఒక ద్రష్టగా మారారు. యుగానుకూల మార్పులకు శ్రీకారం చుట్టారు. అటువంటి మహాపురుషుడ్నే స్మరించుకోవటం, ఆ పనిలో లీనం కావటం మనం వారికి సమర్పించే నిజమైన శ్రద్ధాంజలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *