ఇది హిందూ దేశమని ఉద్ఘాటించింది మొదట సంఘమే
కొన్ని సంవత్సరాలుగా హిందూదేశం హిందువులది అని సంఘం పదే పదే చెబుతూ వస్తోంది. సంఘం ప్రారంభించబడిన రోజుల్లో ఈ శబ్దాన్ని ఉచ్చరించడం మహా పాపమని భావింపబడేది. ప్రజలు ఈ విషయాన్ని బిగ్గరగా అనడానికి కూడా జంకేవారు. సంఘమే మొట్టమొదట ఈ వాక్యాన్ని బహిర్గతపరిచింది. కానీ బహిరంగ సభల్లో వేదికల మీద నిల్చుని, ఉపన్యాసాలివ్వడం, సిద్దాంతాల గురిచి పత్రికలలో వ్యాసాలు ప్రచురించడమూ సంఘ పద్దతి కాదు. ప్రచార సాధనాలను ఆశ్రయించకుండానే సంఘం హిందూ దేశం, హిందువులది అనే సిద్దాంతాన్ని కేవలం స్వయంసేవకులలోనే ప్రచారం చేసినా ఈ ప్రచారం వల్ల ప్రభావితులై ఈనాడు అనేక వేదికల మీది నుంచి అనేకులు ఈ సిద్దాంతాలను ఉద్గాటిస్తున్నారు.
– కేశవ రామ్ బలిరాం హెడ్గెవార్