అహంకారం దరిచేరనీక మనం పరమవైభవం సాధిద్దాం : డా. శ్రీ మోహన్‌ ‌జీ భగవత్‌

అహంకారం దరిచేరనీయకుండా దేశానికి పరమవైభవ స్థితిని తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ శ్రీ ‌మోహన్‌ ‌భగవత్‌ ‌పిలుపునిచ్చారు. భాగ్యనగర్‌లో నూతనంగా నిర్మించిన ఏబీవీపీ కార్యాలయం ‘‘స్పూర్తి ఛాత్ర శక్తి భవన్‌’’ ‌ప్రారం భోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ శ్రీ ‌మోహన్‌ ‌జీ భగవత్‌, అతిథులుగా ఏబివీపి అఖిల భారత సంఘటనా కార్యదర్శి, ఏబివిపీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కుమారి నిధి త్రిపాఠి, ఆర్‌.ఎస్‌.ఎస్‌, ‌వివిధ క్షేత్రాల పెద్దలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోహన్‌ ‌జీ భగవత్‌ ‌మాట్లాడుతూ ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని ఎంతో కాలంగా శ్రమించి ఒక కార్య సిద్ధి సాధించిన వారికి, ఎవరి ప్రేరణతో ఈ కార్యాలయం నిర్మించారో వారందరికీ అభినందనలు తెలిపారు. మన దగ్గర ఉన్న కార్యకర్తలను ఆత్మవిశ్వాసమే ఏదో ఒక రోజు మన ఆలోచన న్యాయబద్ధమైన అని దానికి ఒక విజయం లభిస్తుంది అనడానికి ఈ కార్యాలయమే ఒక సాక్ష్యం అని ఆయన అన్నారు. ఏబీవీపీ అంటే ఏమిటో తెలంగాణలో ఏబీవీపీ కార్యం ను చూసి తెలుసుకోవచ్చన్నారు. ఈ సమయంలో మీరందరూ ఆనందంగా, ఉత్సహంగా ఉన్నారు కానీ మన సంఘ ప్రార్థనలో చెప్పుకున్నట్టుగా ఇది కంటాకాకీర్ణ మార్గం అని, ప్రతికూల వాతావరణంలో మన పని వేగం పెంచడానికి చెమటతో పాటు రక్తాన్ని కూడా చిందించాల్సి వచ్చింది అని ఆయన గుర్తు చేశారు.

సత్యాన్ని న్యాయాన్ని నమ్ముకుని నడుస్తున్నప్పుడు తమదే సత్యం ఇతరుల అంతా వ్యర్థం అనుకునే తర్క వాదులు వారి సర్వశక్తులను ఒడ్డి సత్యాన్ని న్యాయాన్ని అణచాలని చూశారు. కానీ సత్యం ఎప్పటికీ దాగదు అని ఆయన పేర్కొన్నారు. అన్యాయాలను ఎదురించి.. బలిదానమిచ్చిన కార్యకర్తల తప ఫలమే ఈ కార్యాలయం అని ఆయన అన్నారు.

స్పూర్తి భవనం అనే పేరు సరైనదే. ఇక్కడి ఏబీవీపీ కార్యానికి ఘన చరిత్ర ఉన్నది. ఇదంతా చూసి మన మనసులో ఒక స్ఫూర్తి ఉద్భవిస్తుందని ఆయన ఆకాక్షించారు. మొదటినుండి ఏబీవీపీ తెలంగాణ ప్రాంత కార్యం అగ్రస్థానంలో ఉంది, ఎలా ఉండాలో తెలంగాణ చూపెట్టి నిలబడింది, కార్యాలయం ట్రెండ్‌ ‌సెట్టర్‌గా మిగిలింది, ఒకవైపు విరోధులను ఎదుర్కొని నిలబడటం, మరోవైపు ఆవిరోధులతో కలిగిన నష్టాన్ని నివారించడం ఈ రెండూ తెలంగాణ ఏబీవీపీ కే చెల్లింది. వీటి ప్రతిరూపమే నేటి కార్యాలయమని ఆయన పేర్కొన్నారు.

 ఒక సమయంలో ఏబీవీపీ కార్యకర్తలను చూసి అందరూ నవ్వేవారని, మీరు సరస్వతీ ప్రార్థన చేస్తారని ఫస్ట్ ‌ర్యాంకులో నిలిచిన వారికి అభినందనలు తెలుపుతారని హేళన చేసేవారు, కానీ మనల్ని హేళన చేసిన వారే ఇప్పుడు మన దారిలో నడుస్తున్నారు, వారు అదే పనులు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అప్పుడు మనలను పట్టించుకోని వారు ఇప్పుడు మనలను అగ్రగణ్యులుగా గుర్తిస్తున్నారని తెలిపారు. సమాజంలో ఒక స్థాయి రాగానే మనకు అహంకారం వస్తుంది… అందరిలాగా మనం కేవలం విజయం కోసమే పరితపించ రాదు, విజయమే లక్ష్యం కాదు అది మార్గం మాత్రమే కావాలి.

యుగాల నాడే పితృవాక్య పరిపాలన కోసం అడవి మార్గం పట్టిన రాముడిని కేవలం స్మరించడంమే కాకుండా ఆయన ఆదర్శాలపై మనం నిలవాలని కోరుకుంటున్నాం అన్నారు. జూలియస్‌ ‌సీజర్‌ ఎన్ని విజయాలు సాధించినా అహంకారంతో అడుగంటి పోయాడు. ధర్మాన్ని ఆచరణలో చూపిన మన రాముడు అందరి నోళ్లలో నానుతున్నాడని ఆయన స్పష్టం చేశారు.

మనం ఎప్పుడూ మోసాల వెంట, కీర్తి వెంట, అబద్ధాల వెంట పడరాదు. శీలం వెంట మాత్రమే ఉండాలి జ్ఞాన శీల ఏకత లే మన బలం కావాలని  కార్యనిష్ఠతో పరమ వైభవాన్ని సాధించాలని విద్యార్థులకు, విద్యార్థి నాయకులకు మోహన్‌ ‌జీ ఈ సందర్భంగా సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *