ధార్మిక నాగరికతా ప్రతినిధి ద్రౌపది ముర్ము
2022 సంవత్సరం జులై 25న భారతదేశపు 15వ రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము బాధ్యతలు చేపట్టారు. భారత్ పార్లమెంట్‌కు అధినేత్రిగా, భారత్ సాయుధ బలగాలకు సుప్రీం కమాండర్‌గా నిలిచిన తొలి వనవాసీ మహిళగా ఆమె వినుతికెక్కారు. భారత్‌ను బీజేపీ పాలిస్తున్న కాలంలో అలా జరగడం కాకతాళీయం కాదు. భారత్‌లో హిందుత్వ ఉద్యమం నిరంతరం సమాజంలో వేర్వేరు వర్గాల మధ్య అనుసంధానం, సద్భావన, సమరసతలకు వెన్నంటి నిలుస్తుందని గుర్తుంచుకోవాలి.
ముర్ము ఒక నాగరికతా విముక్తి ప్రక్రియకు మూర్తీభవించినవారు. మానవ నాగరికత ఆవిర్భ వించిన నాటి నుంచి పోడు వ్యవసాయం వరకు, ఆ తర్వాత పట్టణ కేంద్రాలకు చేరుకునే క్రమంలో అలాంటి ఒక పట్టణీకరణకు దూరమైపోయిన సామాజిక తెగలు అడవుల్లో నివసించే సామాజిక తెగలుగా మిగిలిపోయాయి. అనేక నాగరికతా తెగల మధ్య అలా అడవుల్లో నివసించే తెగలు ఆదిమ, అనాగరికమైనవిగా పరిగణనకు గురయ్యాయి. అలాంటి తెగలు అంతరించిపోవడం లేదా ఆధిపత్య వర్గాల్లోకి కలిసిపోయాయి.
వలస రాజ్యాల కాలంలో, అది ఆసియాలో కావొచ్చు, ఆస్ట్రేలియా లేదా అమెరికాలో కావొచ్చు, అటువంటి అడవి, పర్వత ప్రాంతం లేదా గడ్డి భూములపై ఆధారపడి, వాటినే తమ జీవనాధారంగా చేసుకున్న తెగలను విస్తారమైన సహజ వనరుల కోసం లక్ష్యంగా చేసుకున్నారు. వాటిని నాశనం చేశారు. వనవాసీలుగా వినుతికెక్కిన ఈ తెగలు ఇప్పుడిప్పుడే గుర్తింపునకు నోచుకుంటున్నాయి.
వనవాసీ తెగలకు చెందిన వారు ఎంతో పవిత్రమైవారుగా గుర్తింపును పొందారు. అలాగని వారిలో విభేదాలు, వైషమ్యాలు లేవనికాదు. ఆయా తెగల్లో విభేదాలు, వైషమ్యాలు ఉన్నాయి. అయితే వనవాసీలుగా పిలుచుకునే అటవీ తెగలతో ప్రాకృతిక బంధాలను ధర్మం ఉద్ఘాటించింది. కానీ, వలసవాదం, మతప్రచారం ఆయా తెగలపై సరికొత్త కథనాన్ని తెరపైకి తీసుకు వచ్చాయి. వారిని షెడ్యూల్డ్ తెగలుగా వర్గీక రించాయి. అంటే వారు ‘ఆదివాసీలు’ మరీ స్పష్టంగా చెప్పాలంటే వారిపై ఆదిమవాసులు అనే ముద్ర వేశాయి. వలస పాలన కాలంలో వారిని ఆదిమ ప్రజలుగా చిత్రీకరించారు.
వనవాసీలు సైతం నాగరికతను ఆపాదించు కోవాలి. అయితే, వలసవాద సామాజిక శాస్త్రం ప్రకారం వనవాసీలు హిందువులైన పక్షంలో వారు వర్ణ వ్యవస్థలో చివరి మెట్టు దగ్గర మిగిలిపోవడం లేదా వర్ణ సామాజిక చట్రం వెలుపల అవమానాల పాలవుతారు.
ప్రస్తుతం, ‘ఆదివాసీ’ అనే పదం.. భారత ప్రభుత్వం, మైదాన ప్రాంతంలో నివసించే ప్రజలను భారత్ ఉపఖండంలో వాస్తవికంగా నివసిస్తున్న వారి ప్రాంతాల్లో చొరబడి వారిని అణచివేసే వారుగా సూచించడానికి ఉపయోగిస్తున్నారు. ఇది భారత దేశపు మైదాన ప్రాంతాల్లో నివసించే వర్గాల పట్ల అటవీ ప్రాంతాల్లో నివసించే తెగలకు ఒక దురభిప్రాయం కలిగించడానికి ఐరోపా వలస పాలకులు చేసిన ఒక దుష్ప్రచారం.
ఈ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా, వనవాసీ సామాజిక వర్గాలు హిందూ నాగరికతలో ఎప్పటికీ అవిభాజ్య మని ఆధునిక కాలంలో గాంధీ నుంచి సావర్కర్ దాకా ఘంటాపథంగా చెప్పారు. వనవాసీలు ధర్మానికి చెందిన ఒకానొక కీలకమైన భాగం.
ఇది బ్రిటీష్‌వారు అవలంభించిన వనవాసీ లను విభజించు విధానానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ వైఖరి కాదని గుర్తుంచుకోవాలి. హిందూ సమాజంలో పేరొందిన కులాలు తీరుగా వనవాసీ సామాజిక వర్గాలూ హిందువులే అని చెప్పిన సందర్భంలో శాశ్వతమైన ఒక ధార్మిక సూత్రాన్ని గాంధీ ప్రవచించారు.
చివరగా, ఒడిశాలో ఒక వనవాసీ తెగకు చెందిన ఒక చురుకైన మహిళా నాయకురాలు రైసానా హిల్‌కు చేరుకున్న తరుణాన, కంథమాల్‌లో వనవాసీ బాలబాలికల సంక్షేమం, వారి సర్వతోముఖాభివృద్థి కోసం పనిచేసిన కారణంగా దేశ వ్యతిరేక, వనవాసీ వ్యతిరేక శక్తుల చేతిలో అమరులైన స్వామీ లక్ష్మానంద సరస్వతి సర్వోన్నత త్యాగాన్ని మరువరాదు.