డీఆర్‌డీవో రాకెట్ స్లెడ్ టెస్ట్ విజయవంతం.. అంటే ఏమిటంటే..
డీఆర్డీవో మరో పరీక్షను అత్యంత విజయవంతంగా పరీక్షించింది. యుద్ధ విమానాల్లో ప్రమాదం జరిగిన సమయంలో పైలట్ సురక్షితంగా బయటపడడానికి ఉపయోగించే అత్యవసర వ్యవస్థ (ఎస్కేప్ సిస్టమ్) ను విజయవంతంగా పరీక్షించింది. దీంతో భారత్ ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచింది. భారత వైమానిక దళ పైలట్ల భద్రతకు ఈ పరీక్ష అత్యంత కీలకమైంది. నియంత్రిత వేగంతో రైల్ ట్రాక్ రాకెట్ స్లైడ్ (RTRS) ఫెసిలిటీలో నిర్వహించారు. ఈ పరీక్షను చండీగఢ్ లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబ్ లోని రైల్ ట్రాక్ రాకెడ్ స్లెడ్ కేంద్రంలో నిర్వహించారు.
మరో వైపు ఈ విషయాన్ని మంగళవారం రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ పరీక్ష స్వదేశీ యుద్ధవిమాన రక్షణ సాంకేతికతలో ఒక పెద్ద అడుగుగా భావిస్తున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’ పోస్ట్‌లో టెస్ట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఈ విజయంతో పైలట్ ఎజెక్షన్ సిస్టమ్‌ను పూర్తిగా పరీక్షించగలిగే సామర్థ్యం ఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ ఎస్కేప్ సిస్టమ్‌ను నియంత్రిత వేగంతో పరీక్షించారు. కానోపీ సెవెరెన్స్ , ఎజెక్షన్ సీక్వెన్స్, ఎయిర్‌క్రూ రికవరీ ప్రక్రియ వంటి అన్ని దశలు విజయవంతమయ్యాయి. ఈ టెస్ట్‌ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA), హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంయుక్తంగా నిర్వహించాయి. డైనమిక్ ఎజెక్షన్ టెస్టులు చాలా క్లిష్టమైనవి, స్టాటిక్ పరీక్షలకంటే నమ్మదగినవి.
ఈ పరీక్ష ఏమిటంటే…
పరీక్షల్లో స్టాటిక టెస్ట్స్ కంటే డైనమిక్ ఎజెక్షన్ పరీక్షలు చాల క్లిష్టం. ఇవి ఎజెక్షన్ సీటు పనితీరు, కానోపీ వేరు చేసే వ్యవస్ధ, సామర్థ్యాన్ని అంచనా వేయడానికి అసలైన పరీక్ష. ఈ డైనమిక్ టెస్ట్ కోసం LCA యుద్ధవిమానం ముందు భాగాన్ని పోలిన డ్యుయల్ స్లెడ్ వ్యవస్థను ఉపయోగించారు అనేక ఘన ఇంధన రాకెట్ మోటార్లను దశల వారీగా మండించి, ఈ స్లెడ్ వ్యవస్థను ఒక నిర్దిష్ట వేగానికి చేర్చారు. ఈ మొత్తం ప్రక్రియను పరీక్షించడానికి, కీలకమైన పరికరాలు అమర్చిన ‘‘ఆంత్రోపోమార్ఫిక్ టెస్ట్ డమ్మీ’’ ని ఉపయోగించారు. ప్రమాద సమయంలో పైలట్ అనుభించే ఒత్తిళ్లు, బలాలను, వేగాన్ని ఈ డమ్మీలోని పరికరాలు రికార్డు చేశాయి.
విమానం ప్రమాదానికి గురైనప్పుడు లేదా నియంత్రణ కోల్పోయినప్పుడు పైలట్ ప్రాణాలు కోల్పోకుండా.. కేవలం సెకన్ల వ్యవధిలో సీటుతో సహా గాల్లోకి ఎగిరి, తర్వాత ప్యారాచూట్ సాయంతో సురక్షితంగా నేలపైకి దిగేందుకు ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది. ఈ సీటు దిగువన చిన్నపాటి రాకెట్ ఇంజన్లు ఉంటాయి. అవి క్షణాల్లోనే మండి సీటు గాల్లోకి ఎగురుతుంది. తేజస్ విమానాల కోసం డీఆర్‌డీవో ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీనిని ఇప్పటివరకు కదలకుండా ఉండే ఒక వేదిక మీది నుంచి ప్రయోగించి చూశారు. కానీ గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విమానంలో అది ఎలా పనిచేస్తుందన్నది పరీక్షించేందుకు ‘రాకెట్-స్లెడ్ టెస్ట్’ నిర్వహించారు.