‘‘ప్రళయ్ క్షిపణి’’ పరీక్షలు విజయవంతం
కొత్తగా అభివృద్ధి చేసిన ‘‘ప్రళయ్ క్షిపణి’’ ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి సమీపంలో వుండే ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ పరీక్షలు జరిగాి. ఉపరితలం నుంచి ఉపరితలంపైనున్న లక్ష్యాలను ఛేదిస్తుంది ఈ అస్్రం. 150 నుంచి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అలాగే 500 నుంచి 1000 కిలోల సంప్రదాయ వార్ హెడ్ ను కూడా మోసుకెళ్తుంది. ఇంతటి క్షిపణిని DRDO రూపొందించింది. అత్యధిక, అత్యల్ప రేంజీని అంచనా వేయడానికి యూజర్ ఎవల్యూషన్ ట్రయల్స్ ను నిర్వహించారు.
ప్రళయ్ అనే బాలిస్టిక్ క్షిపణిని యుద్ధ రంగాల్లో నేరుగా వినియోగించేందుకు వీలుగా తయారు అయ్యింది. భారత వాయుసేన, సైన్యం అవసరాలకు తగినట్లుగా దీనిని తీర్చిదిద్దారు. ఇది 150 నుంచి 500 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను ఛేదిస్తుంది. శత్రువుల కమాండ్ సెంటర్లు, లాజిస్టిక్స్ హబ్స్ ను ఇది లక్ష్యంగా చేసుకోగలదు కూడా.
విజయవంతమైన ప్రయోగాలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ DRDO, సాయుధ దళాలు మరియు పరిశ్రమ భాగస్వాములను ప్రశంసించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన ఈ క్షిపణి వ్యవస్థ దేశ రక్షణ సామర్థ్యాలను పెంచుతుందని ఆయన అన్నారు.
రక్షణ పరిశోధన-అభివృద్ధి శాఖ కార్యదర్శి మరియు DRDO ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ ఇందులో పాల్గొన్న బృందాలను అభినందించారు మరియు ఈ దశ-1 విమాన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయడం క్షిపణిని చివరికి సాయుధ దళాలలోకి చేర్చే దిశగా కీలకమైన అడుగు అని అన్నారు.