చైనా చర్యలను అడ్డుకునేందుకు ‘‘జొరావర్’’ రెడీ… పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో, ఎల్‌అండ్ టీ సంయుక్తంగా మరో మైలు రాయిని అధిగమించాయి. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా చర్యలను అడ్డుకునేందుకు తయారు చేససన ‘‘జొరావర్’’ అనే తేలిక పాటి యుద్ధ ట్యాంకును రూపొందించాయి. దీని తయారీ పూర్తైందని డీఆర్డీవో ప్రకటించింది. 25 టన్నుల బరువుంటుంది. వాయు మార్గంలోనూ రవాణా చేయవచ్చు, ఇదే దీని ప్రత్యేకత. లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు 350కి పైగా జొరావర్ ట్యాంకులను మోహరించాలని భారత ససన్యం భావిసవ్తంది. ప్రధానంగా పర్వత ప్రాంతాల్లో వీటిని మోహరించనున్నారు. కేవలం రెండు సంవత్సరాల్లోనే డీఆర్డీవో, ఎల్‌అండ్ టీ వీటిని రూపొందించాయి. అయితే… ప్రాథమికంగా జరగాల్సిన పరీక్షలు గుజరాత్‌లోని హజీరాలో జరిగాయి. 2027 నాటికి ఈ జొరావర్ యుద్ధ ట్యాంకులను ససన్యంలోకి ప్రవేశపెడతామని డీఆర్డీవో అధిపతి సమీర్ కామత్ తెలిపారు. ఈ తేలిక పాటి యుద్ధ ట్యాంకుల తయారీలో సక్సెస్ కావడం తమకెంతో సంతోషన్న్రి ఇచ్చిందని అధికారులు ప్రకటించారు. డీఆర్డీవో ఇతర ప్రైవేట్ సంస్థలు కలిసస పనిచేస్తే ఏం సాదిస్తామో చెప్పడానికి ఇదే ఉదాహరణ అని పేర్కొన్నారు.