ప్రపంచ ప్రసిద్ధి చెందిన ”పాలగుట్టపల్లె ఎకోఫ్రెండ్లీ బ్యాగులు”… ఆర్ధిక పుష్టి సాధిస్తున్న మహిళలు

చిత్తూరు జిల్లాలోని పాలగుట్టపల్లెలో 210 నుంచి 2015 వరకు విపరీతమైన కరువు తాండవించింది. కరువు వల్ల అన్ని రంగాలు, ముఖ్యంగా వ్యవసాయం తీవ్రంగా దెబ్బత్నిది. ఊరిలోని వారు కొందరు కూలీలుగా వలసెళ్లిపోయారు. పశు సంపదను పూర్తిగా అమ్మేసుకున్నారు. దీంతో అదే ఊరిలో అపర్ణ  అనే విద్యావంతురాలు ఈ పరిణామాలన్నింటినీ దగ్గరుండి చూస్తున్నారు. ఈమె సాఫ్ట్ వేర్ ఇంజినీర్ . ఆ గ్రామంలోని వారందరితో మాట్లాడారు. వారందరికీ వ్యవసాయం కూడా మరేదైనా పని వచ్చా? అంటూ ఆరా తీశారు. దీంతో కుట్లు, అల్లికలు తమకు బాగా వచ్చునని ఆ ఊరి మహిళలందరూ ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. దీంతో అపర్ణ  వారందరికీ ఎకోఫ్రెండ్లీ కాటన్  బ్యాగులు కుట్టాలని పిలుపునిచ్చింది . ఆ నలుగురు అపర్ణ  చెప్పిన సూచనను మంత్రంలా పాటించారు. ఈ నలుగురు మహిళలు కుట్టిన ఎకోఫ్రెండ్లీ బ్యాగులను సోషలన మీడియాలో ప్రమోటన చేయడం ప్రారంభించింది. దీనిని మరికొంత మంది మహిళలు కూడా పాటించడం ప్రారంభించారు. ఇలా ఇప్పటి వరకు 50,000 ఎకోఫ్రెండ్లీ బ్యాగులను అమ్మారు. కేవలం భారతనలోనే కాకుండా రష్యా, కెనడా, అమెరికాలో మన బ్యాగులు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఆ ఊరిలోని మహిళలు స్వావలంబత సాధించారు. వారి కాళ్ల మీద వారే నిలబడుతున్నారు. పర్యావరణాన్ని రక్షిస్తున్నారు.

అయితే అపర్ణ  మొదట్లో ఈ ఎకోఫ్రెండ్లీ బ్యాగుల వ్యాపారం ప్రారంభించడానికి ప్రతి మహిళకి 500 రూపాయలు ఇచ్చింది. మొదట్లో కేవలం తనకి పరిచయం వున్న వారికి మాత్రమే బాగా విక్రయించేది. కానీ…2017 లోనే ఆ మహిళల దశ తిరిగింది. ఉత్తరప్రదేశన వేదికగా 2017 లో ఆర్గానిక్  కాంగ్రెస్  జరిగింది. ఈ సమావేశం కోసం ఏకంగా 1,300 బ్యాగుల భారీ ఆర్డరన వచ్చింది. ఈ డిమాండనను చేరుకోడానికి గ్రామంలోని ఇతర మహిళలు కూడా వచ్చి చేరారు. ఆ సమావేశం నుంచి తమ దశ పూర్తిగా మారిపోయిందని, భారత దేశం మొత్తం నుంచి తమకు ఆర్డర్లు వస్తున్నాయని, ఇతర దేశాల వారు కూడా ఆర్డర్లు చేస్తున్నారని తెలిపారు. పెద్ద మొత్తంలో ఆర్డర్లు వస్తున్నాయని, ఇలా తాము 50 రకాల ఎకోఫ్రెండ్లీ బ్యాగులను తయారు చేసి పంపుతున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా కస్టమర్లు ఏ అవసరానికి బ్యాగులు అడిగితే అలా కూడా తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.

అయితే.. ఇందులో ఎక్కువగా అమ్ముడుపోయినవి, అందరూ అడుగుతున్నవి కూరగాయల కోసం బ్యాగులు. ఈ డిమాండు విపరీతంగా వుందని మహిళలు తెలిపారు. ఇది కూడా కస్టమర్ల నుంచే వచ్చిందని, అన్ని కూరగాయలు కలిసిపోకుండా… ఆ బ్యాగులో విడివిడిగా ఖానాలు కూడా కుడుతున్నట్లు తెలిపారు. ఈ కూరగాయల బ్యాగులే బాగా అమ్ముడుపోతున్నాయి. కొన్ని రోజుల వరకు కేవలం బ్యాగులు మాత్రమే కుట్టేవారమని, కొన్ని రోజుల తర్వాత వాటిపై డిజైన్లు కూడా కుట్టాంటూ డిమాండ్లు వచ్చాయని, ఇప్పుడు తమ వద్ద డిజైన్లతో కూడిన ఎకోఫ్రెండ్లీ బ్యాగులు వున్నాయని సంతోషంగా చెప్పుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *