అయోధ్య బాల రాముడి అలంకరణకి మన దుబ్బాక చేనేత వస్త్రం
దుబ్బాకలో తయారయ్యే చేనేత వస్త్రం మరోసారి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయోధ్య బాలరాముడి అలంకరణ కోసం డిల్లికి చెందిన ప్రముఖ డిజైనర్ మనీశ్ త్రిపాఠి దుబ్బాక కంపెనీలోని లెనిన్ ఇక్కత్ వస్త్రాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఆ కంపెనీ ఎండీ బోడ శ్రీనివాస్ వెల్లడిరచారు. ఇప్పటికే రెండు కలర్లతో కూడిన వస్త్రాన్ని అందజేశామని, ఆ రెండిరటిలో బాల రాముడ్ని అలంకరించడానికి పింక్ కలర్ వస్త్రాన్ని ఎంపిక చేశారు. అంతేకాకుండా వారం పాటు బాల రాముడ్ని అలంకరించే లెనిన్, ఇక్కత్ వస్త్రాలను కూడా దుబ్బాక కేంద్రంగానే తయారు చేస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ప్రతి వస్త్రం 12 మీటర్ల పొడువు వుంటుందని పేర్కొన్నారు. ఇలా తాము తయారు చేసిన వస్త్రాన్నే బాల రాముడి అలంకరణ కోసం వాడటం తమకెంతో ఆనందాన్ని ఇస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.