అయోధ్య బాలరాముడి స్టాంప్ ను విడుదల చేసిన లావోస్

అయోధ్య బాలరాముడి ఫొటోతో ఓ స్టాంపు వచ్చింది. ఈ స్టాంపు తెచ్చింది మనం కాదు. ఆగ్నేయాసియా దేశమైన లావోస్‌ శ్రీరాముడితో వున్న స్టాంప్‌ను విడుదల చేసింది. ఇలా రాముడితో వున్న స్టాంపును విడుదల చేసి తన భక్తిని చాటుకుంది. లావోస్‌ వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌, లావోస్‌ విదేశాంగ మంత్రి సాలెమ్‌క్సే కొమ్మాసిత్‌ సంయుక్తంగా ఈ స్టాంపును విడుదల చేశారు. ఇక.. ఈ సెంట్‌లో రెండు స్టాంపులున్నాయి. ఒకటేమో ఫాబాంగ్‌లోని బుద్ధుడ్ని, మరో స్టాంపుపై అయోధ్య రామ్‌లల్లా వుంది. భారత్‌, లావో మధ్య లోతుగా పాతుకుపోయిన నాగరికత, సాంస్కృతిక సంబంధాలను తెలియజేస్తున్నాయని జైశంకర్‌ పేర్కొన్నారు.
లావోస్‌లో బౌద్ధంతో పాటు రామాయణం కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆగ్నేయ ఆసియా దేశాలలో సంస్కృత భాష బాగా ప్రాచుర్యంలోకి వెళ్లింది. దీని తరువాత ఆగ్నేయాసియా దేశాలలోని రాజులు అశోక చక్రవర్తిని అనుకరించడం ప్రారంభమైంది. అశోకుడి లాగా చక్రవర్తి అన్న ముద్రను వేయించుకోవడానికి అక్కడి రాజులు తమను తాము విష్ణువు, శివుడు, బుద్ధుడితో సమానంగా ప్రకటించుకోవడం ప్రారంభమైంది. దీంతో అక్కడ గొడవలు బాగా తగ్గి, పరిపాలన సవ్యంగా సాగిందని చెప్పుకుంటారు. ఇక నమస్కారం మొదలు.. పెళ్లి, శుభకార్యాలు, సంప్రదాయాలు అన్నీ మనలాగే వుంటాయి. అక్కడి లావో భాష కూడా సంస్కృతం ప్రాకృతం ప్రభావంతో వుంది. అక్కడి లిపి కూడా బ్రాహ్మీ లిపి నుంచే ఉద్భవించాయి. అలాగే లావోలో వివాహాన్ని మనం పిలుచుకున్నట్లే వివాహం అని అంటారు. అలాగే అక్కడి బౌద్ధ విహారాలపై రామాయణ దృశ్యాలు చెక్కబడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *