చెరుకు పిప్పితో ప్లేట్లు, గ్లాసులు… ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తున్న తెలుగు మహిళ
ప్రస్తుతం పర్యావరణం విషయంలో కాస్త శ్రద్ధ పెరిగినట్లే కనిపిస్తోంది. ప్లాస్టిక్ బదులు బట్ట సంచులు, ప్లాస్టిక్ ప్లేట్ బదులు బయోడిగ్రేడబుల్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు బదులు ఇంట్లో వాడే మామూలు గ్లాసులు…. మరో వైపు రసాయనాలతో కూడిన వ్యవసాయం కాకుండా సేంద్రీయ వ్యవసాయం… ఇలా కొంతలో కొంత మార్పు కనిపిస్తోంది.అయితే.. ఎకోఫ్రెండ్లీ వుండే ఉత్పత్తులకు గిరాకీ కూడా అదే రేంజ్ పెరిగిపోయింది. డిమాండ్ కూడా పెరిగింది. చాలా ఫంక్షన్లలో భోజనాలకు ప్లాస్టికన ప్లేట్లకు బదులుగా ఇప్పుడు కంపోస్టేబుల్ టేబుల్ వార్ వాడుతున్నారు. చెరకు పిప్పితో తయారయ్యే కంపోస్టేబుల్ వేర్స్ వాడుతున్నారు. ఇది పర్యావరణంలో తేలికగా కలిసిపోయి, భూసారానికి తోడ్పడతాయి.
విశాఖపట్నంలో వుంటున్న విజయలక్ష్మీ అనే మహిళ ఎకోఫ్రెండ్లీ ఉత్పత్తులను తయారు చేస్తూ, పర్యావరణ హితమైన మహిళగా పేరు తెచ్చుకుంటున్నారు. చెరకు పిప్పితో ప్లేట్లు, గ్లాసులు తయారు చేస్తున్నారు. తన స్టార్టప్ ఆఫ్ ఫోలియం ద్వారా పర్యావరణ అనుకూలమైన మరియు బయోడిగ్రేడబుల్ ప్లేట్లను తయారు చేస్తున్నారు. ఆహార పరిశ్రమకు కావాల్సిన వస్తువులను ఎకోఫ్రెండ్లీ పద్హతిలో తయారు చేసి ఇస్తున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ మార్గాలను పెంచాలన్న లక్ష్యంతోనే ఇలా చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
వెదురు, పామన, చెరుకు గుజ్జు లాంటి ప్రత్యామ్నాయంతో పాటు వ్యవసాయ వ్యర్థాలతో పర్యావరణ అనుకూలమైన వంట సామాగ్రిని తయారు చేస్తామని, చెరుకు వ్యర్థాలు బాగా ఉపయోగపడతాయని తెలిపారు. ఏపీతో పాటు మన దేశంలో చెరుకు పండించే ప్రాంతాలు చాలానే వున్నాయని, అందుకే చెరుకు ముడి పదార్థాలతో కొరత కూడా తనకు లేదని తెలిపారు. మొదట్లో తన స్టార్ట్ అప్ ప్రారంభంలో చాలా తక్కువ మంది ఆకర్షితులయ్యారని , కానీ… ఇప్పుడు చాలా మంది పర్యావరణ ప్లేట్లు, గ్లాసుల కోసం తమ దగ్గరికి వస్తున్నారని పేర్కొన్నారు. తమ స్టార్ట్ అప్ ద్వారా ప్రస్తుతం ప్లేట్లు, గిన్నెలు, గ్లాసులు, ప్యాకింగ్ బాక్సులను మాత్రమే అందిస్తున్నామని అన్నారు.
ఎలా తయారు చేయాలంటే….
చెరుకు వ్యర్థాలను రైతుల నుంచి కొనుగోలు చేసి, కొంత కాలం నానబెట్టాలి. తరువాత యంత్రాలతో ప్రాసెస్ చేస్తారు. ఇది పూర్తిగా బయోడిగ్రేడబుల్ చెత్తలో వున్నప్పుడు 90 రోజుల్లో కుళ్లిపోతుంది. ఒక జంతువు దీనిని తిన్నా… ఎలాంటి హానికరం కాదు.తమ పద్దతి పూర్తిగా పర్యావరణ అనుకూల ఉత్పత్తులని స్పష్టం చేస్తున్నారు. దీనిని మైక్రోవేవ్ పాటు ఫ్రిజనలో కూడా పెట్టుకోవచ్చు. ఎలాంటి హానీ చూపదు. ఈ పద్దతి ద్వారా రైతులకు అదనపు ఆదాయం కూడా వస్తుందని, వారికి కూడా జీవనోపాధి లభిస్తుందన్నారు. లాకనడౌననలో తమ వ్యాపారం బాగా పెరిగిందని, ఇప్పుడు లాభాల బాటలో వున్నామని విజయలక్ష్మి తెలిపారు.