PFI తో సంబంధాలున్న SDPI అధ్యక్షుడి అరెస్ట్
నిషేధిత PFI తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై SDPI జాతీయ అధ్యక్షుడు ఫైజీ అరెస్టయ్యాడు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన వెంటనే ఫైజీని పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయమూర్తి ఫైజీకి ఆరు రోజుల కస్టడీ విధించారు.రిమాండ్ గడువు ముగిసిన తర్వాత మళ్లీ కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
అయితే అతనికి వైద్య పరీక్షలు జరిగేలా చూడాలని, రంజాన్ ఉపవాసం చేస్తానంటే అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోర్టు ఈడీ అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా 15 నిమిషాల పాటు అతని న్యాయవాదితో కలిసే అవకాశం కూడా ఇవ్వాలని ఆదేశించింది.
అయితే… తమ కస్టడీకి ఫైజీని ఇవ్వాలని ఈడీ కోర్టును ఆదేశించింది. అక్ర నిధుల బదిలీలు, డబ్బులు, కేసుతో ముడిపడి వున్న ఆర్థిక లావాదేవీలు, లావాదేవీల వెనుక వున్న వ్యక్తుల విషయంపై ప్రశ్నించాల్సి వుందని ఈడీ తరపు న్యాయవాదులు వాదించారు. ఫైజీకి నిషేధిత PFI తో సన్నిహితంగా దీర్ఘకాలికంగా సంబంధాలున్నాయని, SDPI స్థాపనకు ముందు ఫైజీ అందులో సభ్యునిగా వున్నాడని వాదించారు.