నిషేధిత PFI కి షాక్.. 67 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కి చెందిన 67.03 కోట్ల విలువైన ఆస్తులతో పాటు మరో 8 స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. ఈ ఆస్తులన్నీ వివిధ ట్రస్టుల పేరుతో, దాని రాజకీయ సంస్థ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) పేరిట ఉన్నాయి.గతంలో కూడా నిర్వహించిన సోదాల్లో కూడా ఈడీ PFI నిర్వహిస్తున్న అనేక రికార్డులను స్వాధీనం చేసుకున్నాయి.అలాగే ఫిజిలక్ ఎడ్యుకేషన్, శిక్షణా కార్యక్రమాలను నిర్వహించిందని, అలాగే తమకి సంబంధించిన ఆస్తుల విషయంలో షెడ్లు కూడా నిర్మించిందని, దీనికి సంబంధించిన రికార్డులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. తాజాగా వల్లువనాడ్ హౌస్ పట్టంబి మరియు మలబార్ హౌస్ కి చెందిన ఆస్తులను అటాచ్ చేసింది.
అలాగే తప్పుడు యజమానులను సృష్టించి, నిషేధిత పీఎఫ్ఐ వివిధ ఆయుధాలతో, ప్రమాదకరమైన, విన్యాసాలను కూడా ఇదే ఆస్తులతో నిర్వహిస్తోందని, అలాగే వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోందని ఈడీ పేర్కొంది.జిహాదీ ఎజెండాను అమలులోకి తేవడానికి, అలాగే చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
భారత్ అంతటా తన ఉగ్రవాద చర్యలకు పాల్పడడానికి వారి ఆఫీస్ బేరర్లకు, సభ్యులకు, కేడర్ కి ఆర్థిక సాయం కోసం, బ్యాంకింగ్ మార్గాలతో పాటు హవాలా, విరాళాల ద్వారా పీఎఫ్ఐ ప్రయత్నాలు చేస్తోందని, కేవలం భారత్ లోనే కాకుండా, విదేశాల నుంచి కూడా ఈ నిధులు అందినట్లు ఈడీ ప్రకటించింది. సహాయ, సామాజిక కార్యకలాపాల పేరుతో పిఎఫ్‌ఐ, ఎస్‌డిపిఐలు రూ.131 కోట్ల నిధులను సేకరించాయని తెలిపింది.