వందేమాతరం@150… వందేమాతరం ఉద్భవం ఇలా… (పార్ట్ -1)
(రాంపల్లి మల్లికార్జున)
[150 సంవత్సరాల క్రితం అంటే 1875 నవంబర్ 7 న ఆవిష్కరించబడిన వందేమాతర గీతం
జాతీయ చైతన్యానికి ప్రేరణ ఆచరిత్ర ను మననం చేసుకొందాము ]
వందేమాతరం అనేది భారతీయుల్లో దేశభక్తి భావానికి నిజమైన అర్ధం ఇస్తోంది. ఈ నినాదమే బెంగాలు విభజన
రద్దుచేయడానికి జరిగిన ఉద్యమానికి ప్రేరణ. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న విప్లవకారుల ప్రేరణ గీతం వందేమాతరం.విప్లవకారులు ఉరికంబాన్నిముద్దా డేందుకు ప్రేరణకూడా వందేమాతరమే. ఈ వందేమాతర గీతాన్ని రచించిన వారు బంకించంద్ర చటోపాధ్యాయ. ఈ గీతాన్ని ఆనందమరం ద్వారా మనకు అందించారు. బంకించంద్ర వందేమాతర గీతాన్నిరచించటానికి అనేక సందర్భాలు దోహదపడ్డాయి.
1868 ఏప్రిల్ 11న కలకత్తా నగరంలోపెద్దఎత్తున హిందూ మ్మేళనం జరిగింది. ఆ సమ్మేళనంలో ‘’జయ భారతిజై’’ అనే భావాత్మక గీతం పాడారు. అదిబంకించంద్రను చాలా ప్రభావితం చేసింది. మాతాభూమిఃపుత్రోహం సృథివ్యా:’’ అనేది వేదవాక్యం.ఈభూమి నా తల్లి. నేను
ఆమెపుత్రుడను అనే భావాత్మక ప్రేరణ ఈ వేదవాక్యం. తల్లిభావన పుత్ర వాత్సల్యా నికి ప్రతీక. తల్లి భావన ఆత్మీయత వాత్సల్యనికి ప్రతీక . తల్లి వాత్సల్యమే పుత్రులను సరైన మార్గంలో నిలబెడుతుంది. సోదర భావం జాగృతం చేస్తుంది. వేల సంవత్సరాల నుండి మన మనస్సులలో నిక్షిప్తమైన ఈ మాతృభూమి కల్పనను జాగృతం చేయాలని బంకించంద్ర భావించారు. భవభూతి కాళిదాసులాగా శక్తిమంతమైన సార్వకాలీనమైన, ఒకపదాన్ని సృష్టించాలని తపన చెందారు.
1875సం. బంకించంద్ర కలకత్తా నుండి తన స్వస్థలమైన కాంతాల్ పాడా వెళ్లడానికి రైలెక్కారు. ప్రయాణంలో దారి పొడుగున కన్పించిన నదీ జలాలు, పచ్చటి చేలు, పూలు, పండ్ల తోటలు వారికి ఒక మధురమైన అనుభూతికలిగించింది . ఆ అనుభూతి వందేమాతర గీతానికి ప్రేరణ. అంతకంటే ఆలోచనలు రేకెత్తించిన సంఘటన 1875 సం. నవంబరు 7న జరిగింది. ఆ రోజు రాత్రి గంగానది ఒడ్డున ఒక ఇంట్లో బంకించంద్ర ఉన్నారు. రాత్రి ధ్యానం చేసుకుంటున్న సమయమది. చంద్రుడు ఆకాశంలో వెలుగుతూ అమృతాన్ని వర్షిస్తున్నాడు. ఆ వెలుతురు గంగానది జలాలను ప్రకాశవంతం చే స్తున్నది . ఈ మనోహర దృశ్యం చూస్తున్న ఒక జాలరి ఒక అద్భుతమైన బెంగాలీ జానపద గీతాన్ని శ్రావ్యంగా పాడుతున్నాడు ధ్యానంలో ఉన్న బంకించంద్ర చెవిలో పడింది. ఆ పాటపైకి బంకించంద్ర ధ్యానంమరలింది. భావాత్మకమైన ఆలోచనలలోకి వెళ్లిపోయారు.
ఆ జాలరి పాడిన పాటయొక్క భావము గంగ మాకు నది మాత్రమే కాదు, అది మా దుర్గమ్మ తల్లి. మా జీవితాలకు ఆ తల్లి కరుణే ఆలంబన మాకు ప్రేరణ. ఆ తల్లి కొరకు, ఆ తల్లిలో లీనమయ్యేందుకు ఆతల్లే మాకు ప్రేరణ ఆ భావన బంకించంద్రుడిని కదలించింది. ఆ క్షణంలో దుర్గామాత వర్ణన స్ఫురణకు వచ్చింది. ఆ మాత శతృ సంహారానికి ఖడ్గం ఎత్తిన దృశ్యము. రాక్షసులను మర్దించిన దృశ్యం కళ్ల ముందు కదలాడింది. ఆ తల్లి
సింహవాహిని , శతృసంహారిణి, వీరమాత, అటువంటి వీరమాతా యొక్క ఆరాధన నేడుకావాలి. జన
సామాన్య హృదయాలలో నిండి ఉన్న ఆమాత ఆవాహన కావాలి. అదే వందేమాతరానికి ప్రేరణ. ఆ రాత్రే వందేమాతర గీతం రచన జరిగింది. మనం ఆ తల్లి బిడ్డలం ఆ తల్లి – వీరవ్రతాన్ని మనం ఆరాధించాలి. అలా వందేమాతర గీతం 1875 నవంబరు7 కార్తీక శుద్ధ నవమి రోజున రాత్రి రచింపబడింది.