పర్యావరణాన్ని కాపాడుకుందాం

జూన్‌ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణం మానవుని శ్రేయస్సుకుపకరించే అంశం. అభివృద్ధి పేరుతో జల, వాయు, భూ కాలుష్యం కల్గిస్తున్న ప్రపంచ దేశాలు రాబోయే ముప్పును గురించి కూడా అలోచించాల్సి వుంది. భారతీయ చింతనలో ప్రకృతిని తల్లిగా భావించాం. ప్రకృతితో సమన్వయం, సహకారం మన స్వభావం. కాని పాశ్చాత్యదేశాలు ప్రకృతిని కేవలం ఓ భోగ వస్తువుగానే భావించాయి. అందువలన మానవ సౌఖ్యం కోసం ప్రకృతి శోషణ మొదలు పెట్టారు. వాయు కాలుష్యం వల్ల భూమి ఉష్ణోగ్రత 2099 వరకు 60 సెంటీగ్రేడు పెరుగుతుందని, దాన్ని 20 సెంటీగ్రేడుకు పరిమితం చేయాలని గతసారి ప్రపంచ ధరిత్రీ సదస్సు పారిస్‌లో జరిగిన సంద ర్భంగా భారత్‌ చొరవతో 196 దేశాలు నిర్ణయిం చాయి. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దీన్ని బుట్టదాఖలు చేశారు. దీనిపై ప్రపంచ దేశాలన్నీ కన్నెర్ర చేశాయి. తరువాత అయన దూకుడు తగ్గింది. అనేక దేశాల అమలు చేసిన ఉష్ణ తీవ్రతను తగ్గించే చర్యల వల్ల ఓజోన్‌పొర కొంత బలపడిర దని కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఓజోన్‌ పొర మనకు గొడుగులాంటిది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలవల్ల మనకు కలిగే ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తుంది. వాతావరణ మార్పుల ప్రభావం విషయమై భారత్‌లో తీవ్రమైన కృషి జరుగుతోంది. కార్పొరేట్‌ కంపెనీలు ఓజోన్‌ పొరను విచ్ఛిన్నం చేసే వాయువులకు ప్రత్యామ్నాయ వాయువులను వాడుతుంటే, సంప్రదాయ ఇంధన వనరుల వాడకం నుంచి భారత్‌ క్రమంగా సూర్యశక్తి, గాలిమరల నుంచి వచ్చే శక్తికి ప్రాధాన్యమిస్తున్నది. ప్రధాని మోదీ 102 గిగావాట్ల సూర్యశక్తి సామ ర్థ్యాన్ని లక్ష్యంగా ఉంచారు. సూర్యశక్తి వినియోగం లోకి తెచ్చేందుకు అనేక సబ్సిడీలను కూడా ప్రకటిం చారు. భూటాన్‌లో మాదిరిగా ఇక్కడకూడా బ్యాటరీ కార్లు, వాహనాలు వాడకంలోకి వచ్చే అవకాశాలు మెరుగవుతున్నాయి. అపుడు పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించవచ్చు. ఇక ఘనవ్యర్థాల విషయా నికి వస్తే ఒక్క సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌తో కూడిన చెత్తను సముద్రంలోకి వదులుతున్నారు. దీనివల్ల చాలా ప్రమాదం జరుగనున్నదని అంతర్జాతీయ పర్యావరణ సంస్థ పేర్కొంటోంది. పోలిథిన్‌ సంచులు, ప్లాస్టిక్‌ వినియోగాన్ని వీలయినంత వరకు తగ్గించాలి. మార్కెట్‌కు వెళ్ళినపుడు ప్రతి ఒక్కరు బట్ట సంచులను తీసుకెళ్ళాలి. ఘన పదార్థాలతో కూడిన చెత్తను పొడి, తడి చెత్తలుగా లేదా భూమిలో కలిసే, కలవని చెత్తలుగా విభజించి విసర్జించగలిగితే చెత్తనుంచి కూడా ఎంతోలాభం చేకూరుతుంది. కూరగాయలు, ఆహారపదార్థాలు, పళ్ళు తాలూకు వ్యర్థాలను కంపోస్టు ఎరువుగా తయారు చేయవచ్చు. ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రపంచవ్యాప్తంగా సమ్మతి కూడగట్టేపనిలో పర్యావరణ నిపుణులున్నారు. ఒక చెట్టును నాటడం, మురుగు నీటిని సరిjైున రీతిలో వదలడం, నీరు నిలువలేకుండా చూడడం, నీటిని, విద్యుత్తును, వాహన ఇంధనాన్ని పొదుపుగా వాడడం, వీలయినంతవరకు ఆర్టీసి, మెట్రోరైలు వంటి ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించడం ప్రతి సామాన్యుడూ ప్రతి గ్రామంలో, నగరంలోని బస్తీలో చేయదగిన పనులు. పర్యావరణ దినోత్స వాన్ని ఈసారి భారతదేశపు నేతృత్వంలో ప్రపంచం జరుపుకోవడం భారతీయ సాంస్కృతిక మూల్యాలకు పట్టం కట్టడమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *