పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి కర్తవ్యం
జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది ఒక మహత్తర కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై ఏర్పడే దుష్పరిణామాలను ఎదుర్కోవడానికి ప్రజలను జాగృత పరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కాలుష్యా నికి ప్రముఖ కారణాలు : 1. జల కాలుష్యం, 2. వాయు కాలుష్యం, 3.భూ కాలుష్యం.
జల కాలుష్యం
భూగోళంపై 80శాతం జలం విస్తరించి ఉంది. అయినప్పటికీ తాగడానికి ఉపయోగపడే శుద్ధమైన నీరు దొరకడం లేదు. స్వచ్ఛమైన నీటి లభ్యత మూడు శాతం కంటే తక్కువగా ఉంది. ఎక్కువ శాతం నీరు కాలుష్యం అధికమై లేదా ఉప్పు నీటి రూపంలో ఉంది. లభించే కొద్దిపాటి శుద్ధజలం మానవ చర్యల వల్ల కలుషితమై కేవలం మానవులే కాక సమస్త ప్రాణి జగత్తు ముఖ్యంగా జలచరాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. పర్యావరణ పరిశోధకుల కథనం ప్రకారం వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికి వేయడం కారణంగా నీటిని సంరక్షించే వృక్షజాతులు తరిగిపోయి అనావృష్టి సమస్య ఉత్పన్నమవుతుంది.
వాయు కాలుష్యం
మానవ ప్రేరిత చర్యల వల్ల వాతావరణంలో కొన్ని విషపూరితమైన వాయువులు చేరి, ప్రాణ వాయువు కూడా కాలుష్యపూరితంగా మారిపో యింది. 2016లో వెలువడ్డ ఒక సర్వే రిపోర్ట్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 90% ప్రజలు కాలుష్య పూరితమైన వాయువులు పీల్చుకునే దుస్థితిలో ఉన్నారు.
దీని కారణంగా అనేక రకాలైన శ్వాసకోశ రోగాలు, క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయి.
భూ కాలుష్యం
మానవుడు పుణ్యదాయిని పవిత్రమైన భూమిని తన స్వార్థ ప్రయోజనాలు సుఖభోగాల కోసం అనేక రకాలుగా నష్టపరుస్తున్నాడు. గృహ వ్యర్థాలు, చెత్తాచెదారం మన భూమి దెబ్బతింటోంది.