‘‘ఆపరేషన్ సిందూర్’’ పై వ్యాసరచన పోటీలు… కేంద్రం ప్రకటన
ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ లోని ఇస్లామిక్ ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసి, ప్రపంచానికి భారత శక్తిని, ఉగ్రవాదంపై తమ వైఖరేమిటో చెప్పేశాయి. ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత ప్రజలందరూ ఒకేతాటి పైకి వచ్చి, భారత సైన్యానికి కొండంత అడంగా నిలిచారు.అలాగే ఆపరేషన్ సిందూర్ సమయంలో పుట్టిన పిల్లలకు కూడా తల్లిదండ్రులు సిందూర, సిందూర్ అని పేర్లు కూడా పెట్టుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ పై రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇతివృత్తంతో వ్యాస రచన పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎక్స్ మాధ్యమంగా ప్రకటించింది. ఈ నెల 1 నుంచి 30 వరకు ఈ వ్యాస రచన పోటీలు వుంటాయని రక్షణ శాఖ పేర్కొంది. ఇందులో విజయం సాధించిన తొలి ముగ్గురికి 10 వేల రూపాయల చొప్పున నగదు బహుమతితో పాటు 78 వ స్వాతంత్ర వేడుకలకు హాజరయ్యే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు. ఈ వ్యాసాలు హిందీ, ఇంగ్లీష్ భాషలో రాయవచ్చని, ఒకరు ఒక్కసారి మాత్రమే పాల్గొనాలని కూడా సూచించింది. తమ వ్యాసాలను www. mygovt.in వెబ్ సైట్ ద్వారా పంపించాలని సూచించింది.