చొరబాటు దారులందర్నీ పంపించేస్తాం : ప్రధాని ప్రకటన
దేశంలోని చొరబాటుదారులందర్నీ తమ ప్రభుత్వం వెనక్కి పంపిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రటకించారు. బిహార్ లో జరిగిన సభలో మోదీ పాల్గొన్నారు. ‘ఈ రోజు సీమాంచల్, ఈస్ట్రన్ ఇండియాలో డొమోగ్రాఫిక్ సంక్షోభం తలెత్తింది. బిహార్, బెంగాల్, అస్సాం, చాలా రాష్ట్రాలు తమ ఆడకూతుళ్లు, సోదరీమణుల భద్రతపై ఆందోళనగా ఉన్నాయి. అందుకోసమే ఎర్రకోట నుంచి నేను డెమోగ్రఫీ మిషన్‌ను ప్రకటించాను. కానీ ఓటు బ్యాంకు కోసం కొన్ని రాజకీయ పార్టీలు చొరబాటుదారులకు కొమ్ముకాస్తూ నిస్సిగ్గుగా నినాదాలు చేస్తున్నాయి. బయట దేశాల నుంచి వచ్చిన చొరబాటుదారులను కాపాడేందుకు యాత్రలు తీస్తున్నాయి’ అని మోదీ విరుచుకుపడ్డారు.
చొరబాటు దారులను వెనక్కి పంపడం ఖాయమని, వారిని రక్షించడానికి ఎవరైనా ముందుకు వచ్చే ధైర్యం చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. చొరబాటు దారులను రక్షించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, వారిని పంపించే సంకల్పంతోనే ముందుకు సాగుతామని మోదీ ప్రకటించారు.