విస్తరిస్తున్న సంఘ కార్యం
గుజరాత్‌లోని కర్ణావతిలో (మార్చ్ 11-13) జరిగిన అఖిల భారతీయ ప్రతినిధిసభ సమావేశాల్లో సమర్పించిన వార్షిక నివేదికలో ముఖ్య అంశాలు:
కార్య స్థితిÑ శిక్షావర్గలు :
ప్రాథమిక (ఏడు రోజుల శిక్షణ) మొత్తం వర్గాలు 1083 (గత ఏడాది 117). వీటిలో పాల్గొన్న శాఖలు 23769(గత సంవత్సరం 2085). వర్గాల్లో సంఖ్య 80438 (గత ఏడాది 10955).
శాఖల వివరాలు
దేశమంతటా మొత్తం 38390 స్థానాల్లో 60929 (గత సంవత్సర సంఖ్య 55652) శాఖలు జరుగుతున్నాయి. ఇందులో పాఠశాల, కళాశాల విద్యార్థులు హాజరయ్యే శాఖలు 29775 (గత ఏడాది 26412). కేవలం కళాశాల విద్యార్థులు హాజరయ్యే శాఖలు 7142 (గత సంవత్సరం 6241). ఉద్యోగస్తులు హాజరయ్యే శాఖలు 17782 (గత ఏడాది 16887). 50 సంవత్సరాలు పైబడిన వారు హాజరయ్యే శాఖలు 6212 (గత సంవత్సరం 6112). సాప్తాహిక్ (వారానికి ఒకసారి జరిగేవి) 20681 (గత ఏడాది 18553). సంఘమండలి (నెలకు ఒకసారి జరిగేవి) 7923 (గత సంవత్సరం 7655).
ప్రచార విభాగం :
ప.పూ. సర్ సంఘచాలక్ జీ ఢల్లీి, భాగ్యనగర్ లో జరిగిన సమావేశాలలో పాల్గొన్నారు. ఢల్లీిలో 2021 సెప్టెంబరు 8న ప్రముఖ 12 ప్రచురణ సంస్థల ముఖ్యులతో సమావేశం జరిగింది. అదే రోజు ఫిల్మ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్స్ వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్లతో మరో సమావేశం జరిగింది. 11 సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. 2021 అక్టోబరు 18న వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్లు, మీడియా ట్రైనింగ్ ఇన్ స్టిట్యూషన్స్ విభాగాల అధిపతులతో ఇష్టాగోష్టి సమావేశం జరిగింది. 32 సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
భాగ్యనగరంలో 2022 జనవరి 18న ప్రముఖ ముద్రణ, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల సంపాదకు లతో సమావేశం జరిగింది. 16 మంది సంపాదకులు హాజరయ్యారు. సినీ నిర్మాతలు, దర్శకులతో జరిగిన మరో సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన 39 మంది పాల్గొన్నారు.
ప్రత్యేక కార్యక్రమాలు
కర్ణాటక దక్షిణ్ జనవరి 2022లో బెంగళూరు మహానగర్ కు చెందిన స్వయంసేవకుల ఘోష్ (బ్యాండ్) ప్రదర్శన ప.పూ సర్ సంఘచాలక్ గారి సమక్షంలో జరిగింది. ప్రముఖ సంగీత నిపుణులు, కళాకారులు మరియు రిటైర్డ్ ఆర్మీ సిబ్బందితో సహా ఆహ్వానించబడిన ప్రముఖులు హాజరయ్యారు. 130 స్వయంసేవకులు 5 కొత్త వాటితో సహా 53 ఘోష్ రచనలను 89 నిమిషాల పాటు నిరంతరంగా వాదన చేశారు.
తెలంగాణలో నక్సల్ ప్రభావిత జిల్లా నల్గొండలో 2021 డిసెంబర్ 12న ‘హిందూ శక్తి సంగమం’ జరిగింది. ఇందులో మా. సర్ కార్యవహ శ్రీ దత్తాత్రేయ హోసబలే పాల్గొన్నారు. 352 ప్రదేశాల నుండి 3,959 మంది గణవేష్ (యూనిఫారం) ధారీ స్వయంసేవకులు, 1,928 మంది సాధారణ ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పథ సంచలన్ ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన కొత్త స్వయం సేవకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఫలితంగా, 21 కొత్త సాప్తాహిక్ మిలన్ మరియు 56 కొత్త నెలవారీ సంఘమండలి ప్రారంభమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం, భీమవరం విభాగ్‌లు సంయుక్తంగా 2021 డిసెంబర్ 26న ‘గోదావరి సంగమం’ కార్యక్రమం నిర్వహించాయి. 8,000 కొత్తవారితో సహా మొత్తం 12,736 మంది స్వయంసేవకులుÑ మొత్తం 146 బస్తిలు, 286 మండలాల నుండి పాల్గొన్నారు. ఆ తరువాత జనవరి 26, 2022న అన్ని ఖండ కేంద్రాలు, మండల కేంద్రాల్లో పథసంచలన్ కార్యక్రమాలు జరిగాయి.