మసీదు మరమ్మతులు… బయటపడ్డ రాతి శిలలు
వనపర్తి జిల్లాలోని ఖిల్లాగణపురం మండల కేంద్రంలో మసీదు పునరుద్ధరణ పనుల్లో పురాతన స్తంభాలు, రాతిశిలలు బయటపడ్డాయి. ఖిల్లాగణ పురం బస్టాండు సమీపంలోని జామా మసీదు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.80 లక్షలు ఇచ్చింది. కొన్ని రోజులుగా మసీదు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే మసీదు చుట్టు పక్కల వున్న చెట్లు, ముళ్ల పొదలను తొలగించి, శుభ్రం చేస్తున్నారు. ఈ సమయంలోనే అక్కడ స్తంభాలు, రాతిశిలలు బయటపడ్డాయి.
ఈ విషయం తెలుసుకున్న భజరంగ్ దళ్ నేతలు అక్కడికి చేరుకొని, స్తంభాలు, రాతిశిలలను పరిశీలించారు. శతాబ్దాల క్రితం ఇదే స్థలంలో ఓ దేవాలయం వున్నట్లు పూర్వీకులు చెబుతుంటారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ స్థలంలో మసీదు నిర్మించివుంటారని అభిప్రాయపడ్డారు. మసీదు పునరుద్ధరణ జరుగుతుండగా స్తంభాలు, రాతి శిలలు బయటపడటంతో పురావస్తు శాఖ అధి కారులు, ప్రభుత్వ అధికారులు వాటిని పరిశీలిం చాలని భజరంగ్‌దళ్ నేతలు సూచించారు.