హిజాబ్ వద్దే వద్దు : ఫజే హష్మీ
ఇరాన్ మాజీ అధ్యక్షుడు అక్బర్ హష్మీ కూతురు ఫజే హష్మీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇస్లామిక్ ప్రభుత్వం అవసరమే లేదన్నారు. అంతేకాకుండా అసలు హిజాబే అవసరం లేదని తేల్చి చెప్పారు. హిజాబ్ వాడకాన్ని వ్యతిరేకిస్తూనే అమెరికాతో సంబంధాలను కొనసాగించాలన్నారు. హిజాబ్, ఇస్లాం రాజ్యం ఇవేవీ అవసరమే లేదని, అణుబాంబు వుండాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ఇరాన్ సంబంధాలను పునరుద్ధరించడాన్ని సమర్థిస్తానన్నారు. అయితే.. ఇతర దేశాలలో రాయబార కార్యాలయాలను తెరిస్తే.. కాస్త దౌత్య సంబంధాలు బాగుంటాయన్నారు.
ఇరాన్ లో సంస్కరణలు రావాలని ఫజే హష్మీ చాలా రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వం దౌత్య విషయాల్లో తమ వైఖరులను మార్చుకోవాల్సిందేనని కొన్ని రోజులుగా డిమాండ్లు చేస్తున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల దగ్గర అణుబాంబులు వున్నాయని, మన దగ్గర వుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఇరాన్ లో హిజాబ్ తప్పనిసరి అన్న నిబంధనను ఆమె చాలా రోజులుగా బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ధరించని మహిళలకే తమ మద్దతు అని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ప్రత్యేకంగా పాల్గొన్నారు కూడా.