దేవుడిపై నమ్మకమే ఆవులను కాపాడింది..
100 ఆవులతో కచ్ నుంచి ద్వారాక కాలినడకన వెళ్లిన మహదేవ్‌జీ దేశాయ్
దేవునిపై ఒక గట్టి విశ్వాసం కలిగిఉండడం భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలలో ఎప్పటి నుంచో ఉన్న ఒక గొప్ప విషయం. గుజరాతీలో ‘‘విశ్వాసే వాహన్ తారే’’ అంటే ‘విశ్వాసమే ఒకరిని రక్షించేది’ అని ఒక సామెత ఉంది. మన భరత భూమిలో ఎంతో మంది గొప్ప మానవులు జీవించారు. నర్సింహా మెహతా, మీరాబాయి వంటి వారు దేవుడిపై వారికున్న విశ్వాసం వారిని భగవంతుని వద్దకు తీసుకెళ్ళింది. ఆ పరమాత్మునిపై అదే విశ్వాసం నేటి కాలంలో కూడా చెక్కుచెదరకుండా ఉందని నిరూపించే ఎన్నో సంఘటనను ఇప్పటికీ మనకు కన్పిస్తున్నాయి.
లంపీ వంటి ప్రాణాంతక వ్యాధి నుండి తన ఆవులను రక్షించడానికి గుజరాత్‌లోని కచ్‌వాగడ నివాసి అయిన గోవు ఆరాధకుడు మహదేవ్‌జీ దేశాయ్ ద్వారికాధీష్‌పై నమ్మకంతో వెంటనే అతను తన 100 ఆవులతో కలిసి కచ్ నుండి ద్వారకకు కాలినడకన ప్రయాణమయ్యాడు. ఆ భయంకరమైన వ్యాధి పేరు కూడా తెలియకుండా కచ్ నుండి ద్వారక వరకు ఆవులతో నడిచి వెళ్లిన ఈ ఘటన సనాతన ధర్మంపై విశ్వాసం, నమ్మకం చెక్కు చెదరలేదనడానికి సజీవ ఉదాహరణగా నిలిచింది.
మహాదేవ్‌జీ దేశాయ్ గత 20 సంవత్సరాలుగా మెలక్ బెట్‌లోని వర్ణేశ్వర్ దాదా ఆలయం, గోశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది కాకుండా, మేలక్ బెట్‌కు వచ్చే యాత్రికుల ఏర్పాట్లను కూడా అతను నిర్వహిస్తాడు.
‘‘లంపీ వైరస్ కారణంగా మా గోశాలలోని సుమారు 100 ఆవులు ప్రభావం పడుతుందనే భయంతో దేవున్ని ప్రార్థించాము. గోశాలలోని ఆవులు ఈ మహమ్మారి నుండి బయటపడితే, ఈ ఆవులతో కచ్ ఎడారి నుండి దేవభూమి ద్వారకకు కాలినడకన ప్రయాణించి ఆవులను ద్వారికాధీష్ స్వామిని చూసేలా చేస్తానని నేను ప్రతిజ్ఞ చేసాను. వర్ణేశ్వర్ దాదా దయ, ద్వారికాధీశుడి దయతో గోశాలలోని ఒక్క ఆవు లేదా దూడ కూడా వ్యాధి లక్షణాలు కనిపించలేదు. కాబట్టి నేను నా ప్రతిజ్ఞను నెరవేర్చాను. మెలక్ బెట్ నుండి ద్వారకకు 468 కి.మీ కంటే ఎక్కువ దూరం, 100 ఆవులతో ప్రయాణం చేయడం పెద్ద సవాలుగా ఉండేది. దారిలో పశువులకు మేత, తాగునీరు అందక ఆందోళన చెందాం. ద్వారకాధీశుని దర్శనం కోసం ఆవులు ద్వారకకు వెళుతున్నాయని తెలిసిన చోట వారు ఆవులకు ఆహారం, నీరు ఏర్పాటు చేశారు. అలా ఈ సుదీర్ఘ ప్రయాణం ఎప్పుడు ముగిసిందో మాకు తెలియలేదు.’’ అని మహాదేవ్‌జీ దేశాయ్ తెలిపారు.
ద్వారికాధీశుని దర్శనం కోసం సుదీర్ఘ ప్రయాణం చేసి ఇంత పెద్ద సంఖ్యలో గోవులు ఒక్కచోట చేరిన సంఘటన గతంలో ఎక్కడా జరగ లేదని ఇక్కడ పేర్కొనడం గమనార్హం. పగటిపూట భక్తుల రద్దీ ఉంటుందని, స్థానిక యంత్రాంగం రాత్రి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారని, కానీ ఈ అపూర్వ ప్రయాణం గురించిన వార్త వ్యాప్తి చెందడంతో, చాలా మంది ప్రజలు రాత్రిపూట కూడా ఆలయంలో ఉండి ఈ దివ్య దర్శనాన్ని ఆస్వాదించారని మహాదేవ్‌జీ దేశాయ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
‘‘ఇంత ప్రయాణం చేసినా అసలు అలసట లేదు. ఇది గొప్ప సంతృప్తినిచ్చింది. ద్వారికాధీశుడు ఈ గోవులను ఎలాగోలా ఇక్కడికి తీసుకొచ్చాడు. మనం ఒక మాధ్యమం మాత్రమే. ఈ ప్రయాణంలో ఒక్క ఆవు కూడా ఇబ్బంది పడలేదు. దర్శనం అయ్యాక రెండు నిమిషాలపాటు గోవులు కూడా శాంతించినట్లు అనిపించడం ఎంతో అద్భుతమైన ఘట్టం’’ అని తెలిపారు.