RSS సంకల్ప పత్రం ఇదే.. ఆ నకిలీ పత్రాన్ని నమ్మవద్దు

విశ్వ శ్రేయస్సే లక్ష్యమై నిలిచిన సనాతన ధర్మాన్ని ఆధారం చేసుకుని లోకకళ్యాణం కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాలను కలుపుకుని వెళుతున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్). భారతదేశానికి చెందని మతాలవారంతా తమ మతం తప్ప మిగిలిన మతాలు, వాటిని అనుసరించేవారు ప్రపంచంలోనే ఉండకూడదనే పెడ ధోరణితో మారణకాండను సృష్టిస్తుంటే… సనాతన ధర్మాన్ని ఆధారంగా చేసుకున్న హిందూ సమాజం మాత్రమే ప్రపంచంలోని సమస్త జీవకోటి మధ్య సమరసతను కాంక్షిస్తోంది. ఆ హిందూ సమాజం ప్రధానంగా ఉన్న భారతదేశం విశ్వగురువుగా పరమవైభవ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మిగిలిన ప్రపంచం శాంతి, సమృద్ధితో విలసిల్లుతుంది. ఇందుకోసం సమరసతతో కూడిన పటిష్టమైన సంఘటిత, శీలసంపన్న, శక్తియుత హిందూ సమాజ నిర్మాణం జరగాలి. ఈ లక్ష్యంతోనే 1925లో పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభించారు. దేశ నిర్మాణం కోసం వివిధ రూపాలలో నిస్వార్థ తపస్సును చేస్తున్న సంఘ్ ఇప్పుడు శతాబ్ది సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో సంఘ్ తీసుకున్న సంకల్పం ఇది. అయితే, సంఘ్ అంటే గిట్టని కొందరు దేశవ్యతిరేకులు ఈ సంకల్పాన్ని మార్చేసి ఆర్ఎస్ఎస్ పేరిట నకిలీ సంకల్ప పత్రాలను ఇంటర్నెట్‌లో సోషల్ మీడియా ద్వారా పంపించి దుష్ప్రచారం చేస్తున్నారు. అసలైన సంకల్ప్ పత్రాన్ని మీ ముందుంచుతున్నాం చూడండి… 
RSS Sankalp
RSS Sankalp
ఈ కింద ఉన్నది సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన తప్పుడు సంకల్ప పత్రం. పైన ఉన్నవి మాత్రమే నిజమైనవని గ్రహించగలరు. నిజమైన కరపత్రం నాలుగు పేజీలు ఉండగా, రెండు పేజీల్లో తెలుగు కంటెంట్, మిగిలిన రెండు పేజీల్లో ఇంగ్లిష్ కంటెంటు ఉంటుంది. కానీ నకిలీ కరపత్రం మాత్రం మూడు పేజీల తెలుగు కంటెంటుతో సృష్టించారు.
Fake Sankalp Patram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *