కుంకుడు పంటతో ‘మిలయనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా’’ పురస్కారం దక్కించుకున్న రైతు

తెలంగాణ రైతు తన కష్టార్జితంతో అంతర్జాతీయ ఖ్యాతిని సాధించాడు. కరువు ప్రాంతంలో వ్యవసాయమంటూ అత్యంత ధైర్యంతో ముందుకు సాగాడు. ఆ ఒక్క అడుగే 33 ఏళ్లుగా కనక వర్షం కురిపిస్తోంది. ఎకరాకు 5 వేల పెట్టుబడితో ప్రారంభించి… ఇప్పుడు 13 లక్షల వరకూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా కుంకుడు మొక్కల నర్సరీని ఏర్పాటు చేశాడు. దీంట్లో సక్సెస్ సాధించి ‘‘మిలయనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా’’ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఈ కుంకుడు సాగు అంతా పూర్తి సేంద్రీయ పద్ధతిలోనే.

రైతు పేరు పద్మారెడ్డి. నల్లగొండ జిల్లా పోలేపల్లి గ్రామం. మొత్తం 12 ఎకరాల రైతు. నీరు చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే బీడువారిపోయేంత. అయినా.. కరువు ప్రాంతంలోనూ ధైర్యంగా అడుగులు వేసి, కుంకుడు మొక్కల సాగు ప్రారంభించాడు. ఈ కుంకుడు మొక్కలకు ఎక్కువగా నీరు అవసరం లేదు. దీంతో తన 12 ఎకరాల పొలంలో 1200 కుంకుడు మొక్కలు నాటాడు. ఒక్కో మొక్క ఒక్కో మొక్క ద్వారా 250 నుంచి 300 కిలోల కుంకుడు కాయల దిగుబడి వస్తున్నది. అలా ఎకరాకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. కిలో కుంకుడుకాయలు రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. కుంకుడు తోట పెట్టి ఎకరానికి 13 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నాడు.

దేశంలోనే మొట్ట మొదటి కుంకుడు కాయల మొక్కల నర్సరీని పెంచి, ఖ్యాతి గడించాడు. ఆయన నర్సరీలో పెంచిన కుంకుడు మొక్కలను ఛత్తీస్‌గఢ్‌ అటవీశాఖ అధికారులు దిగుబడి చేసుకుంటున్నారు. పేస్ట్‌, సబ్బులను తయారు చేసి నాబార్డ్‌ ద్వారా విక్రయిస్తున్నారు సహజ, సేంద్రియ ఎరువులతో బత్తాయి, నిమ్మ, జామ, బొప్పాయి తోటలను పండిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రైతులు పద్మారెడ్డి క్షేత్రాన్ని సందర్శించి.. ఉద్యాన పంటల సాగులో మెలకువలు నేర్చుకుంటున్నారు. దేశంలోని ఉత్తమ రైతు సేవలను గుర్తిస్తూ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి పురస్కారాలను అందిస్తుంది. దేశంలోనే మొట్టమొదటి కుంకుడు మొక్కల నర్సరీని ఏర్పాటుచేసిన లోకసాని పద్మా రెడ్డినీ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారాన్ని దక్కించుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *