జీవామృతంతో పంటభూమికి అమృతం… విజయాలు సాధిస్తున్న రైతు

జీవామృతం వేస్తే పంట పొలాలకు, మొక్కలకు మేలుచేసే సూక్ష్మ జీవులు పెరుగుతాయని అనుభవంలోకి తెచ్చుకొని, వ్యవసాయం చేస్తున్నాడు మన్మోహన్ రెడ్డి అనే రైతు. జీవామృతం పంట భూమికి అమృతం లాంటిదని చెప్పారు. మన్మోహన్ రెడ్డి బి.ఏ. చదివారు. చదువు పూర్తైన తర్వాత వంశ పారంపర్యంగా వచ్చిన 5 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నారు. టీవీలో వచ్చిన ఓ కార్యక్రమాన్ని చూసి, తినే ఆహారంలో విషాల శాతం అధికంగా వుంటుందని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి వ్యవసాయంపై ఆలోచించడం ప్రారంభించాడు. మెళ్లిగా జీవామృతం, పాలేకర్ వ్యవసాయం వైపు మళ్లాడు.

పాలేకర్ నిర్వహించిన తరగతులకు హాజరయ్యాడు. అప్పటి నుంచి ఆయన చెప్పిన సంప్రదాయ పద్ధతులలో సాగు చేస్తున్నాడు. యేడాదికి యేడాదికి ఎకరాన్ని పాలేకర్ విధానాన్ని ఫాలో అవుతుడూ వచ్చాడు. నాలుగు ఎకరాలలో దిగుబడి వచ్చింది. అలాగే దేశివాళీ విత్తనాలను కూడా అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. ఈ రకాలను ఒక్కొక్క సెంటు స్థలంలో పండించి, విత్తనాలు తయారు చేశాడు.

అలాగే దేశీవాళీ ఆవులను కూడా పెంచడం ప్రారంభించారు. మొత్తం 50 దేశివాళీ ఆవులను పెంచాడు. వాటి పేడను ట్రక్కు 3 వేల రూపాయలకు, గోమూత్రం లీటరుకు 5 రూపాయలకు అమ్ముతున్నాడు. అయితే కొన్ని ఆవుల నుంచి మాత్రమే పాలను సేకరిస్తున్నామని తెలిపాడు.

పాలేకర్ విధానాన్ని పాటిస్తే మొదటి సంవత్సరంలో దిగుబడి తక్కువ వస్తుందన్న విషయం సరికాదని తెలిపాడ. ఇప్పటిదాకా రసాయనాలు వేసి, మనం పంట పొలాలను నాశనం చేశామని, ఆ భూమి బాగవ్వాలంటే కొంత సమయం పట్టడం ఖాయమని తెలిపాడు. మొదటి సంవత్సరం ఘన జీవామృతం, జీవామృతం వేయగానే అవి ఆ చెడు పురుగులను తుదముట్టించి, జీవం కోల్పోయిన మన భూమికి జవసత్వాలు వస్తాయి. రెండో సంవత్సరానికి పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవుల వ్యవస్థ అమోఘంగా అభివృద్ధి చెందుతుంది. తన పొలంలో ఎక్కడ చూసినా వానపాములు అభివృద్ధి చెందుతాయి. మూడో సంవత్సరం నుంచి రసాయన వ్యవసాయం చేసేవారికంటే దిగుబడులు ఎక్కువ వస్తాయన్నాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *