‘రైతు నేస్తం ఫౌండేషన్” ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు రైతు శిక్షణా కార్యక్రమం
”రైతు నేస్తం ఫౌండేషన్” ఆధ్వర్యంలో, కర్షక్ సేవా కేంద్రం నిర్వహణలో మూడు రోజుల పాటు రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల 18,19,20 తేదీల్లో గుంటూరు జిల్లా కొర్నెపాడు, పుల్లడిగుంట దగ్గర వున్న రైతు నేస్తం ఫౌండేషన్ ఆవరణలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ముందుగా రిజిస్టర్ చేసుకున్న రెండు తెలుగు రాష్ట్రాలలోని 50 మంది రైతులకే అవకాశం వుంటుందని నిర్వాహకులు ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగుతుందని, భోజన వసతి, వసతి సదుపాయం కూడా అక్కడే కల్పిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం, మిశ్రమాలు,కషాయాల తయారీ, సేంద్రీయ పద్ధతిలో వరి, అపరాలు, జామ, బొప్పాయి, అంతర పంటలు, ఐదెంచల సాగు పద్ధతి, గొర్రెలు, మేకల పెంపకం, నాటుకోళ్లు, దేశీయ ఆవులు, గోశాల నిర్వహణ, ఉత్పత్తులు, భూమి సారం పెంపు, మిశ్రమ సాగుతో సహా.. ఇతర విషయాలపై ఈ శిక్షణ వుంటుంది. మరిన్ని వివరాలకు 9705383666, 9553825532 నెంబర్లకు సంప్రదించాలి.