వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయిన రైతులు.. పత్తి పంటను ప్రోత్సహించాలన్న యోచనలో సర్కార్
తెలుగు రాష్ట్రాలలోకి రుతు పవనాలు ప్రవేశించిన నేపథ్యంలో రైతాంగం వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయింది. రైతులు దుక్కులు దున్నడం ప్రారంభించారు. కొంచెం వర్షాలు పడటం ప్రారంభమైతే… విత్తనాలు చల్లేందుకు కూడా తాము రెడీ అయిపోయామని చాలా చోట్ల రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పత్తి పంటకి బాగా డిమాండ్ వుంటుంది. ఈ నేపథ్యంలో విత్తనాల కోసం రైతులు బాగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చివరికి రైతులు నానా కష్టలు పడి విత్తనాలను సంపాదించుకున్నారు. మరో నాలుగు రోజుల్లో తెలంగాణలో వ్యాప్తంగా ఓ మోస్టారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రైతులు రెడీ అయ్యారు. ఈ వానాకాలం ససజన్‌లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వం ఓ అంచనాకి వచ్చేససంది.
గతేడాది వానాకాలంలో 1.26 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగుయ్యాయి. ఈసారి మాత్రం బాగానే పెరిగింది. 8 లక్షల ఎకరాల్లో అధికంగా పంటల సాగు జరుగుతుందని వ్యవసవయ శాఖ తెలిపింది. పంటల సవగు ప్రణాళిక కూడా విడుదల చేసింది . అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, ఆ తర్వాత 60 లక్షల ఎకరాల్లో పత్తి సవగు అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. గతేడాది వరి 65 లక్షల ఎకరాల్లో, పత్తి 44.77 లక్షల ఎకరాల్లో సాగు అయ్యింది. ఈ సారి మాత్రం పత్తి పంట మరో 15.23 లక్షల ఎకరాల్లో సవగు చేసెలా రైతులను ప్రోత్సహించారు. వరి కంటే ఎక్కువగా పత్తి పంటనే ప్రోత్సహించాలన్న యోచనలో ప్రభుత్వం వుంది.