యూపీలో కొత్త వ్యవసాయ విప్లవం… 44 జిల్లాల్లో గ్రీన్, పాలీ హౌస్ తో కొత్త మార్పులు
యూపీలోని యోగి ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. దీంతో రైతుల ఆదాయం మరింత రెట్టింపు చేయాలని తలపోస్తోంది. దీంతో నిరంతరం కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అవలంబిస్తోంది. ఈ క్రమంలో కాలానుగుణంగా పంటల ఉత్పత్తి విషయంలో సాంకేతికతను కూడా మారుస్తోంది. ఇలా చేయడం ద్వారా రైతులను ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అనుగుణంగా సిద్ధం చేస్తోంది.
దీని కింద గ్రీన్ హౌస్, పాలీహౌస్ వంటి సాంకేతికత పద్ధతులను యూపీ సర్కార్ ప్రోత్సహిస్తోంది. తద్వారా రైతులు అన్ సీజన్ లో కూడా పోషకమైన కూరగాయలు, ధాన్యపు పంటలను పండివచ్చు. లక్నో, బహ్రైచ్,సుల్తాన్‌పూర్, బారాబంకి, సీతాపూర్, అమేథితో సహా 44 జిల్లాల రైతులు ఇప్పుడు ఈ మార్పు వైపు అడుగులు వేస్తున్నారు.
రాష్ట్రంలోని 44 జిల్లాల్లో గ్రీన్‌హౌస్‌లు, పాలీహౌస్‌ల వంటి రక్షిత వ్యవసాయం కోసం రైతులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. వీటిలో 24 జిల్లాల్లో గ్రీన్‌హౌస్‌లు పూర్తయ్యాయి, 20 జిల్లాల్లో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిని సమకూర్చడం ద్వారా ప్రతి సీజన్ లో కూడా రైతులు మెరుగైన పంటలను పండించి, మార్కెట్లో అమ్ముకోవడమే లక్ష్యమని యూపీ సర్కార్ పేర్కొంటోంది.
ఈ అభివృద్ధి పనులన్నీ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం కింద జరుగుతున్నాయి. దీనితో పాటు, ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ మిషన్ పథకం కింద దీనిపై సబ్సిడీ కూడా అందిస్తున్నారు. గ్రీన్ హౌస్, పాలీహౌస్ టెక్నాలజీని ఉపయోగించి, వ్యవసాయం చేయడం వల్ల వాతావరణం ప్రతికూలంగా వున్నా… పంటలకు ఇబ్బందులు వుండవు. వీటి ద్వారా రైతులు టమాటాలు, మిరపకాయలు, క్యాప్సికమ్, దోసకాయ, బీన్స్ వంటి పోషకాలున్న కూరగాయలను పండిస్తున్నారు. కేవలం సీజన్ లోనే కాకుండా అన్ సీజన్ లో కూడా వీటిని పండించి, అమ్ముకోవచ్చు. నాణ్యమైన ఉత్పత్తులతో పాటు మార్కెట్ లో అధిక ధరకు కూడా రైతులు అమ్ముకోవచ్చు.
అయితే.. ఈ పాలీ హౌస్, గ్రీన్ హౌస్ నిర్మించుకోవడానికి ప్రభుత్వం రైతులకు భారీగా సబ్సిడీని కూడా ఇచ్చి, ప్రోత్సహిస్తోంది. దీంతో పాటు ఈ పద్ధతిలో శాస్త్రీయంగా పంటలను పండిచడానికి రైతులకు శిక్షణ కూడా అందిస్తున్నారు. తగిన మార్గదర్శనం కూడా చేస్తున్నారు. యోగి ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవతో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది.
గ్రీన్ హౌస్ లు సిద్ధంగా వున్న ప్రాంతాలివీ…
లక్నోలో మూడు ప్రాంతాలు, బాగపట్ లో నాలుగు ప్రాంతాలు, సహరాన్ పూర్ లో మూడు, మీరట్ లో మూడు, బహ్రైచ్ లో రెండు, షామీలో రెండు, ఎటాలో ఓ ప్రాంతం, కాస్ గంజ్ లో రెండు ప్రాంతాలు, కౌశాంబిలో ఒక ప్రాంతం, హర్దోయ్, అలీఘర్, ముజఫర్ నగర్, ఖేరీ, సీతాపూర్, అమేథీ, ఆగ్రాలో ఒక్కో ప్రాంతం సిద్ధంగా వుంది.
తయారీ సిద్ధంగా వున్న జిల్లాలివీ..
ఉన్నావ్, పీలీభీత్, మురాదాబాద్, లక్నో, చందోలీ, షహజాన్ పూర్, బరేలీ, శ్రీవత్సీ, సహారాన్ పూర్, మీరట్, బారాబంకీతో పాటు మరికొన్ని జిల్లాలున్నాయి.