మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టార్ అమెరికాలో అరెస్ట్..

ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో వున్న ఓ గ్యాంగ్ స్టర్ హ్యాపీ పాసియా అమెరికాలో పట్టుబడ్డాడు. ఈ విషయాన్ని ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. గత ఏడు నెలల్లో పంజాబ్ లో మొత్తం 16 గ్రనేడ్ దాడులు జరిగాయి. వీటిల్లో 14 ఘటనల్లో హ్యాపీ పాసియా హస్తముంది. పోలీసు పోస్టులు, ప్రార్థనా మందిరాలు, ముఖ్యుల ఇళ్లతో పాటు బీజేపీ నేత మనోరంజన్ కాలియా ఇంటిపై కూడా దాడులు జరిగాయి. వీటన్నింటిని దర్యాప్తు చేయగా.. హ్యాపీ పాసియా హస్తమున్నట్లు వెల్లడైంది.

ఇక.. ఎన్ఐఏ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్ర సంస్థకి చెందిన నలుగురిపై కేసులు పెట్టారు. ఈ జాబితాలో పాసియా పేరుతో పాటు పాక్ కి చెందిన హర్వీందర్ సింగ్ సంధు కూడా వున్నాడు. ఈ దాడులకు రిండా, హ్యాపీ పాసియా ప్లాన్ చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ అప్పట్లోనే పేర్కొంది. ఈ దాడుల కోసం రోహన్ మిషా, విశాల్ మిషాను నియమించుకున్నారని, వీరే దాడులు చేశారని తెలిపింది.

అమెరికాలో హ్యాపీ పాసియా అరెస్ట్ తర్వాత భారత ప్రభుత్వం కూడా అతని అప్పగింత కోసం ప్రయత్నాలను గట్టిగా ప్రారంభించింది. చాలా పోలీస్ స్టేషన్లు, పోస్టులపై గ్రెనేడ్ దాడులు జరిగాయని, నిందితులను విచారణ చేయగా.. హ్యాపీ పాసియా అనే పేరు కూడా బయటకు వచ్చింది. హ్యాపీ పాసియా తమకు డబ్బులు ఆశ చూపించి, పని అప్పజెప్పినట్లు విచారణలో నిందితులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *