53.5 లక్షల కోట్లతో బడ్జెట్… ఏయే రంగాలకు ఎంతెంత అంటే…
కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్ లో 2026-2027 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించుకుండా, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, ముందుకు సాగుతోందని ప్రకటించారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవిన్యూ వసూళ్లను 35,33,150 కోట్లుగా అంచనా వేశారు.
ఇక మూలధన వసూళ్లు 18,14,165 కోట్లు వుండబోతున్నట్లు తెలిపారు. పన్ను వసూళ్లు 28,66,922 కోట్లు, పన్నేతర వసూళ్లు 6,66,228 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం ఆదాయం 53,47,315 కోట్లుగా అంచనా వేశారు.
మరోవైపు ఈ బడ్జెట్ లో వివిధ కీలక రంగాలకు నిధులు కేటాయించారు. మౌలిక సదుపాయాల కల్పన, దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యిమిచ్చారు. యేయే రంగానికి ఎంత కేటాయించారో చూద్దాం…
1.రవాణా,మౌలిక సదుపాయాల బలోపేతానికి 5,98,520 కోట్లు
2. రక్షణ రంగం – 5,94,585 కోట్లు
3. గ్రామీణాభివృద్ధి – 2,73,108 కోట్లు
4. హోం శాఖ : 2,55,234 కోట్లు
5. వ్యవసాయం, అనుబంధ రంగాల కోసం 1,62,671 కోట్లు
6. విద్యా రంగం – 1,39,289 కోట్లు
7. ఇంధనం – 1,09,029 కోట్లు
8. ఆరోగ్యం, ప్రజారోగ్యం కోసం – 1,04,599 కోట్లు
9. పట్టణాభివృద్ధి కోసం – 85,522 కోట్లు
10.ఐటీ, టెలికాం – 74,560 కోట్లు
11. వాణిజ్యం, పరిశ్రమలు – 70,296 కోట్లు
12. సామాజిక సంక్షేమం – 62,362 కోట్లు
13. శాస్త్రీయ విభాగాలు – 55,756 కోట్లు
14. ట్యాక్స్, అడ్మినిస్ట్రేషన్,- 45,500 కోట్లు
15. విదేశీ వ్యవహారాలు – 22,119 కోట్లు
16. ఆర్థిక శాఖ-20,649 కోట్లు
17.ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి – 6,812 కోట్లు