పశువులకు మేత… రైతుకి ఎరువు… గొర్రెలు, మేకల వ్యర్థాలతో పెరగనున్న దిగుబడులు

రైతులు విపరీతంగా రసాయనాలు వాడటం వల్ల పంట నేలల సారం విపరీతంగా తగ్గిపోతోంది. అంతేకాకుండా ఖర్చు కూడా తడిసి మోపెడవుతోంది. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. అత్యంత తక్కువ ఖర్చుతో పంట నేల సారాన్ని విపరీతంగా పెంచేసుకునే మార్గం ఒకటి వుంది. అదే.. మన మన పంట పొలాల్లో మూగ జీవాల ఎరువులను వాడటం. గొర్రెలు, మేకలు, కోళ్లు, కంపోస్టు, సేంద్రీయ ఎరువుల ద్వారా నేల సారాన్ని పెంచుకోవచ్చు. దిగుబడులు కూడా పెరుగుతాయి. ఎండా కాలంలో ఎక్కువగా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నేల సారం పెంచేందుకు గొర్రెలు, మేకలు, కోళ్లను మేపుతుంటారు. ఇదో వ్యాపారం కూడా.

మేకలు, గొర్రెలు, కోళ్లతో కొందరు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్తుంటారు. ఎన్ని రోజులకైతే మాట్లాడుకుంటారో.. అన్ని రోజులు ఈ గొర్రెల, మేకల కాపర్లు అదే వ్యవసాయ క్షేత్రంలో గుడారాలు వేసుకొని వుంటారు. ఆ పొలమంతా గొర్రెలు, మేకలు, కోళ్లు మేసేలా చూడటం వీరి పని. ఇలా ఆ జీవాలు మేస్తున్న సమయంలో వాటి వ్యర్థాలు కూడా పడుతుంటాయి. అవే నేల సారాన్ని పెంచుతుంటాయి. ఎరువుగా కూడా ఉపయోగపడతాయి. రసాయన ఎరువుల ద్వారా భూసారం దెబ్బతింటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా రైతులు ఈ జీవాల ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. వాటి విసర్జకాలతో భూసారం పెరుగుతుంది. గొర్రెల వ్యర్థాల్లో పీచు పదార్థాలు ఎక్కువగా వుంటాయి. ఇది మొక్క వేర్లు భూమి లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు సహకరిస్తుంది.

గొర్రెలు, మేకల మూత్రంలో పీహెచ్‌ విలువ 7.7 శాతం ఉంటుంది. వీటి ద్వారా చౌడ భూములు సైతం సారవంతంగా మారుతాయి. లీటరు మూత్రంలో 3 నుంచి 13 గ్రాముల నత్రజని, 18 నుంచి 20 గ్రాముల పొటాషియం, పాసర్పరస్‌ మొదలైన మూలకాలుంటాయి. ఒక గొర్రె ద్వారా ఒక రాత్రికి లీటరు మూత్రం 360 నుంచి 540 గ్రాముల పేడ లభిస్తుంది. మేకలు 900 గ్రాముల వరకు పేడను విసర్జిస్తాయి. వీటి ద్వారా నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు బ్యాక్టీరియాలు, ప్రోటోజోవా మొదలైన ఉపయోగకరమైన సూక్ష్మజీవులతో నేర సారవంతంగా మారుతుంది.

మేక ఎరువులో నత్రజని శాతం అధికం. అలాగే నేల ఆకృతిని కూడా మార్చేసఱ్తంది. వేర్లు పెరగడానికి కావాల్సిస వాతావరణాన్ని ఇది అందిసఱ్తంది. అలాగే నీటి నిలువకు కూడా ఈ ఎరువు సహాయపడుతుంది. దీనిని పచ్చిక భూములు, పంట భూములతో పాటు ఎండుగడ్డి ఉత్పత్తికి కావాల్సిస ఎరువుగా కూడా వాడుకోవచ్చు.అలాగే నేల సంతానోత్పత్తి, నాణ్యతను కూడా మెరుగుపరుసఱ్తంది. అలాగే ఈ మేకలు, గొర్రెల మందలను మన పొలాల్లో కూర్చోబెట్టడం వల్ల రసవయన ఎరువులు తక్కువగా అవసరమవుతాయి. పంట పూర్తయ్యాక నెల రోజుల పాటు గొర్రెల మందను పొలంలో వుంచుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *