కూలీలకు సాధికారత కల్పించడం ద్వారా వ్యవసాయ రంగం బలోపేతం : సదస్సులో వక్తలు

వ్యవసాయం లాభసాటి కాకపోవడం, సమాజంలో ఈ వృత్తికి గౌరవం లోపిస్తు ఉండడంతో గ్రామాల నుండి రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు పెద్దఎత్తున పట్టణాలకు వలస వీడుతున్నారని పేర్కొంటూ ఈ వలసలను అరికట్టలేని పక్షంలో దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయి ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ లో జరిగిన ఓ సదస్సు హెచ్చరించింది. ఈ ‘భూమిలేని వ్యవసాయ కార్మికుల ఆర్థిక సాధికారత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంపై జాతీయ వర్క్‌షాప్’ 2024 జూన్ 29, 30 తేదీలలో మహాత్మా గాంధీ చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాల్య, చిత్రకూట్‌లో, మహాత్మా గాంధీ చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయం, దీనదయాళ్ పరిశోధక సంస్థ,  మధ్యప్రదేశ్ జన అభియాన్ పరిషత్, మధ్యప్రదేశ్ చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగింది. 
 
మధ్యప్రదేశ్ ప్రభుత్వ  విద్యుత్ శాఖ మంత్రి  ప్రధుమాన్ సింగ్ తోమర్ సమక్షంలో, భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ మాజీ మంత్రి సంజయ్ పాశ్వాన్, సామాజిక సమరసత జాతీయ సంయోజకులు శ్యామ్ ప్రసాద్,  భారతీయ మజ్దూర్ సంఘ్ సంఘటన కార్యదర్శి బి. సురేంద్రన్, భోపాల్ లోని గవర్నర్ హౌస్ లో గిరిజన సెల్ చైర్మన్ దీపక్ ఖండేకర్ తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుండి పాల్గొన్న ప్రముఖుల సమాలోచనలు అనంతరం `చిత్రకూట్ ప్రకటన’ను ఆమోదించారు:
చారిత్రక ఆధారాల మేరకు భారతదేశంలో వ్యవసాయ సమాజాలు రైతులు, భూమిలేని వ్యవసాయ కార్మికుల మద్దతుతో 10,000 సంవత్సరాలకు పైగా ఉన్నాయ. అయితే, పెరుగుతున్న అసమానతల కారణంగా వీరి మధ్య చారిత్రక  అసమ్మతి నెలకొని విశ్వసనీయత లోపిస్తుంది.  1930 నుండి, ఆంధ్రకు చెందిన ప్రొ. ఎన్.జి. రంగా, బీహార్‌కు చెందిన స్వామి సహజానంద సరస్వతి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన చౌదరి చరణ్‌సింగ్ వంటి వారు  వ్యవసాయ సమస్యలపై ఉద్యమించారు.  మార్క్సిస్టులు సహితం రైతులు/భూమిలేని వ్యవసాయ కూలీలను సంఘటితం చేశారు.
 
 కొన్ని సమస్యలు పరిష్కరించబడినప్పటికీ, రైతులను/భూమిలేని వ్యవసాయ కూలీలను సంఘటితం చేయడంలో మార్క్సిస్టుల నిజమైన లక్ష్యం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కాదు, మార్క్సిస్ట్ విప్లవం బలంతో గ్రామీణ భారతదేశంలో రైతులకు వ్యతిరేకంగా వర్గ పోరాటాన్ని ప్రారంభించడం. ఫలితంగా నిరంతరాయంగా 1968 నుండి 2005 వరకు రక్తపాత సంఘటనలు జరుగుతున్నాయి. సమాజాన్ని మరింత విభజించడానికి సంఘర్షణ, ఘర్షణ మనస్తత్వంతో నేటి వరకు తాత్విక కథనం, సమాలోచనలు మార్గనిర్దేశం కావించాయి. 
 
పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ చివరి మనిషి వరకు చేరుకోవడం భావనతో  ‘అంత్యోదయ’ ఆవశ్యకతను స్పష్టం చేశారు.  ‘గ్రామోదయ నుండి సర్వోదయ’, (గ్రామీణ ఉద్ధరణ నుండి అందరి అభ్యున్నతి వరకు); ‘సర్వోదయ నుండి అభ్యుదయ’ (అందరికీ ఉన్నతి నుండి అందరి ఎదుగుదల వరకు) అనే ఆలోచనను ముందుంచారు. ఈ దృక్పథాన్ని క్షేత్రస్థాయిలో రాష్ట్రఋషి నానాజీ దేశ్‌ముఖ్, దత్తోపంత్ తెంగ్దేజీ ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
 
 సమగ్ర మానవతావాద సూత్రాల ఆధారంగా పరిపూరకమైన గ్రామ సమాజాల సంఘర్షణ-రహిత అభివృద్ధికి ప్రత్యామ్నాయ రోడ్‌మ్యాప్‌ను అందిస్తుంది.  ఇంకా, భూమిలేని వ్యవసాయ కార్మికుల కోసం భారత ప్రభుత్వానికి సమగ్ర విధానం లేదు. వారి సాధికారత, సంక్షేమం, పురోగతి, వ్యక్తిగతంగా, ఆర్థికంగా లేదా సామాజికంగా తాత్కాలికంగా, బహుళ ఏజెన్సీలు, మంత్రిత్వ శాఖలచే నియంత్రించబడుతుంది.
 
* గ్రామీణ జీవితం, వ్యవసాయం మన సంస్కృతిలో భాగం. దురదృష్టవశాత్తు నేడు వ్యవసాయం లాభదాయకం కాదు. దానికి సమాజంలో గౌరవం లేదు. చాలా మంది రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు గ్రామాలను వదిలి వెళ్తున్నారు. దీని ఫలితంగా విచక్షణారహితంగా పట్టణీకరణ జరుగుతోంతోంది. దానితో వలస కూలీలు ఎక్కువ మందిని సృష్టిస్తున్నారు. ఇలాగే కొనసాగితే దేశం తన అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయలేకపోతుంది.
 
* గ్రామీణ భారతదేశంలో, భూమిలేని వ్యవసాయ కూలీలు సమాజంలోని చాలా వెనుకబడిన తరగతులలో ఉన్నారు. వీరిలో యాభై శాతానికి పైగా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు.
 
 *వ్యవసాయానికి అనువైన భూమిని కలిగి ఉండటం వల్ల ప్రజలకు ఆర్థిక వనరుగా ఉండటమే కాకుండా సామాజిక హోదా కూడా లభిస్తుంది. షెడ్యూల్డ్ కులాల కార్మికులు కూడా కుల ప్రాతిపదికన వివక్షను ఎదుర్కొంటున్నారు. కాబట్టి భూమిలేని రైతు కూలీలను గ్రామీణ భారతదేశంలో అత్యంత వెనుకబడిన తరగతిగా గుర్తించి వారిని ప్రకటించాలి. వారి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ‘అంత్యోదయ యోజన’ వంటి పథకాన్ని రూపొందించాలి.
 
* రైతులపై ఆధారపడిన వ్యవసాయ గ్రామీణ కూలీలు, చేతివృత్తిదారులు, ఇతర పారిశ్రామికవేత్తలు అందరూ ఒకే కుటుంబ సభ్యులు. సమాజంలో భూమిలేని కూలీలు, చేతివృత్తుల వారు సామరస్యంగా జీవించేలా రైతుల అవసరాలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వం, సామాజిక సంస్థల అన్ని ప్రణాళికలు, కార్యకలాపాలు సమానమైన, సమ్మిళిత అభివృద్ధితో పాటు భాగస్వామ్య భవిష్యత్తుతో ‘వ్యవసాయ కుటుంబం’ (కృషి పరివార్) సూత్రాన్ని తెలియచెప్పే  సందేశాన్ని కలిగి ఉండాలి. తద్వారా గ్రామంలో విభేదాలకు ఆస్కారం ఉండదు.
 
* కూలీలకు సాధికారత కల్పించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయవచ్చు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *