స్థూలకాయానికి ఆయుర్వేద ఔషధాలు
స్థూలకాయ చికిత్సకు సులభ యోగాలు :
దేహశ్రమ అధికంగా చేయాలి, అధిక దూరం నడవడం, తక్కువ సమయం నిద్రించటం. యావలు, చామలు వంటి సిరి ధాన్యాలు వాడటం, నీరు ఎక్కువుగా ఉన్న భోజన భుజించడం,. ఉదయాన్నే తేనెతో గోరువెచ్చని నీటిని తాగడం.
ఉదయాన్నే వేడి అన్నంగాని గంజిగాని తాగాలి. చవ్యము, జీలకర్ర, శొంటి, మిరియాలు, పిప్పిళ్లు, ఇంగువ, సౌవర్చ లవణం, చిత్రమూలం వీటిని సత్తుపిండి, నీరు, మజ్జిగలో కలిపి తీసుకోవాలి.
వాయువిడంగాలు, శొంటి, యవాక్షారం, ఎర్రచిత్రమూలం, యావలు, ఉసిరికరసం వీటి చూర్ణాలను మజ్జిగతో కలిపి సేవించినా శరీరంలోని కొవ్వు కరుగుతుంది.
శొంటి, పిప్పళ్లు, మిరియాలు సమాన భాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని ఆహారం తిన్న తరువాత ఒక పావు స్పూన్ మజ్జిగలో కలిపి ఉదయం, రాత్రి తీసుకోవాలి. గోమూత్రం ప్రతినిత్యం 10 మి.లీ. నుంచి 15 మి.లీ. వరకు ఒక కప్పు నీటిలో ఉదయం, సాయంత్రం తీసుకుంటే శరీరం సన్నబడును. మితాహారం, నిత్యవ్యాయామం తప్పనిసరి.
– ఉషాలావణ్య పప్పు