చర్మసంరక్షణ కోసం
చందనము, అగరు, వట్టివేరు మూడిరటిని సమానంగా తీసుకుని పాలు లేక పన్నీరు కలిపి లేపనంగా తయారుచేసుకుని ముఖానికి పట్టించి కొంత సమయం తరువాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖ వర్చస్సు పెరుగుతుంది.
చందనం, కుంకుమపువ్వు, కస్తూరి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి లేపనం చేసుకుంటే ముఖవర్చస్సు పెరుగుతుంది.
పద్మ కేసరాలు, నాగ కేసరాలు సమాన భాగాలుగా తీసుకుని ఆ మిశ్రమ చూర్ణాన్ని 3 – 5 గ్రాములు నిత్యం నెయ్యి లేక తేనెతో సేవించుచున్న చర్మసౌందర్యం అమితంగా పెరుగుతుంది.
బూరుగు చెట్టు ముల్లును పాలలో అరగదీసి ఆ గంధాన్ని వ్రాసుకుంటే మొటిమలు పోతాయి.
ఒక కప్పు పాలలో ఒక టీస్పూను నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి మరునాడు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే క్రమేణా ముఖం పైన మచ్చలు తగ్గుతాయి.
కాలిన గాయాల మచ్చలు పోవడానికి బంతి ఆకుల రసాన్ని ఉదయం, సాయంత్రం రాయాలి.
మిరియాలు, చందనం సమంగా కలిపి నీళ్లతో నూరి ఆ గంధాన్ని పూస్తే మొటిమలు పోతాయి .
తులసి ఆకుల రసంలో కొద్దిగా టంకణం (దీశీతీaఞ) కలిపి పూసుకుంటే ముఖం మీద మచ్చలు, మంగు క్రమేణా పోతాయి.
పైన చెప్పిన మూలికలు అన్ని ఆయుర్వేద పచారీ షాపులలో దొరకుతాయి.
– ఉషాలావణ్య పప్పు