అహ్మదాబాద్‌లో నలుగురు ఇస్లామిక్ ఉగ్రవాదుల అరెస్ట్
అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నలుగురు ఇస్లామిక్ ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెరర్రిజం స్క్వాడ్ అరెస్టు చేసింది. వీరు శ్రీలంక వాసులని కూడా పేర్కొంది. అనుమానితులను ఏటిఎస్ పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వీరి కదలికల పట్ల అనుమానం వచ్చి ప్రశ్నించగా… అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీలంక నుంచి చెన్నై మీదుగా అహ్మదాబాద్ చేరుకున్నట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పట్టుబడిన ఈ ఇస్లామిక్ ఐసిస్ ఉగ్రవాదులు పాక్‌లో నిరంతరంగా టచ్‌లో వున్నట్లు కూడా ఏటీఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోది.